నవ్వుతూ బ్రతకాలిరా !!!!- సి.హెచ్.ప్రతాప్)

 1. మీ కొడుకుకూ, కోడలికి ఒక్క క్షణం కూడా పడదట కదా! ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటునే వుంటారని మా కోడలు చెప్పింది"  ఆసక్తిగా అడిగింది అన్నపూర్ణమ్మ.
" అందుకే నేను ఏ చీకు చింతా లేకుండా ఆరోగ్యం గా , ఆనందం గా వుండగలుగుతున్నాను" పళ్ళీలు నములుకుంటూ చెప్పింది అనసూయమ్మ.
"ఇదేదో టెక్నిక్ బాగానే వున్నట్లు వుంది, నేను కూడా నా ఇంట్లో ఉపయోగిస్తే హాయిగా తిని కూర్చోవచ్చు" సంతోషంగా అంది అన్నపూర్ణమ్మ.
2.." ఏం తింటున్నారండి అసలు మీరు, లేస్తే పడిపోయేటట్లు అంత బలహీనంగా వున్నారు" ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ అయోమయం.
"పొద్దస్తమానూ  మా ఆవిడ చేత మొట్టికాయలు, అప్పడాల కర్రతో దెబ్బలు" నీరసంగా జవాబిచ్చాడు నారాయణ.  
3. " నీ మీద హత్యా ప్రయత్నం చేస్తున్నది నీ రెండో సెటప్ అయిన రంభ అనే ఎలా చెప్పగలరు" అడిగాడు ఇనెస్పెక్టర్ రాజు.
" మరి నేను నామినీ గా ఆవిడ పేరుతో మూడేళ్ళ కింద పది లక్షలకు ఇన్సూరెన్సు తీసుకున్నట్లు ఈ మధ్యే ఆవిడతో మాట వరుసకు చెప్పాను" అసలు సంగతి విచారంగా చెప్పాడు మహేశ్వర్.
4."దొంగతనం కేసులో దొరికాక శిక్ష అనుభవించి, ఫైన్ కూడా కట్టక వెంతనే మళ్ళీ నిన్ను పోలీసులు ఇక్కడకు పట్టుకొచ్చేసారా ? ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు గంగులు.
" కోర్టులో నేను కట్టినవి దొంగ నోట్లు అని వాళ్ళకు తెలిసిపోయింది." బాధగా చెప్పాడు బండ రాజు.
  5. "మీ విధ్యార్ధులంతా ఒక మహాత్మా గాంధీనో, భగత్ సింగో లేక సుభాష్ చంద్ర బోసు గానో తయారు కావాలి" ఆవేశంగా ఉపన్యసించాడు సోషల్ టీచర్.
" ముందుగా మాకు పాఠాలు చెప్పే మీరు ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ , సి వి రామనో లేక అబ్దుల్ కలం గానో మారితే బాగుంటుంది సార్" వెనుక బెంచీల నుండి అరిచాడు ఒక తుంటరి కుర్రాడు
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం