నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ

 స్కైథియన్స్ అనే రాక్షసజాతి ప్రజల గూర్చి గ్రీక్ చరిత్ర కారుడు హెరొడొటస్ ప్రస్తావించారు. వారి ఆచారసంప్రదాయాలు మతం జీవిత విధానం అన్ని విపులంగా రాశాడు.70వేలమంది పర్షియన్  సైనికులను ఊచకోతకోసినరాక్షసులు వారు. రష్యన్ పల్లపుభూముల్లో సంచారజాతివారు.గొప్ప యుద్ధవీరులు బంగారం తో చేయబడిన కవచాలు శిరస్త్రాణాలు దువ్వెనలు తో సహా బంగారం లో పొదగబడిన మణి మాణిక్యం వజ్రాల వి వాడారు. అవసరమైతే తమ జాతి తోటివారిని చంపేవారు. శత్రువు తలనరికి.బతికుండగానే చర్మంవలిచి పచ్చి నెత్తురు తాగిన రాక్షసులు. పోన్ టస్ రాజు చేతిలో చావుదెబ్బలుతిని తరిమేయబడ్డారు.2500ఏళ్ళ క్రితమే వారి ఉనికి ఉంది. 1715 లో రష్యా లో వారి సమాధులు బైట పడినాయి. ఇంకా వివరాలు అంతగా తెలీదు. మనరామాయణ భారత భాగవతాల్లో రాక్షసుల గూర్చి విస్తృతంగా వివరించారు కదూ?🌹
కామెంట్‌లు