శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
811)పావనః -

పవిత్రమై యుండినవాడు 
రుద్రాక్ష సమానునిగానున్నవాడు 
గోవు గంగల వంటివాడు 
తులసీ సమానుడైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
812)అనిలః -

ప్రేరణను ఇచ్చుచున్నట్టి వాడు 
నిత్యజాగరూకత యున్నవాడు 
వసువులలో ఒకడైనవాడు 
వాయుదేవుడయి వున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
813)అమృతాశః -

అమృతము నొసగుచున్నవాడు 
యజ్ఞశేషము తానైనవాడు 
ఇలవేలుపుగా నున్నట్టివాడు 
ధన్వoతరి రూపములోనివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
814)అమృతవపుః -

అమృత సమానుడైనట్టివాడు 
శాశ్వతమై యుండినవాడు 
సుధను ప్రసాదించుచున్నవాడు 
అమృతవపు నామధేయుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
815)సర్వజ్ఞః -

సర్వమూ తెలిసినట్టివాడు 
బుద్ధదేవుని రూపునున్నవాడు 
శివమూర్తిగా వెలిసినవాడు 
సమస్తమూ ఎరుకగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు