*అక్షరాల సంబరాలు*;- పెందోట వెంకటేశ్వర్లు-సిద్దిపేట
కలసి మెలసి ఉండాలి
గలగల మాట్లాడాలి
చతురతనే పెంచాలి
జయము కై నడవాలి

టకటక నడవాలి
డంకై మ్రోగాలి
నవిరల కృషిచేయాలి
తలుక్కున మెరువాలి

దగ్గర దూరం విడవాలి
పట్టుదలతో సాగాలి
బంగరు భవితవ్వాలి
మహిలోనె వెలగాలి

యత్నం కొంత చేయాలి
రగిలే మంట అవ్వాలి వి
లక్షణంగా ఉండాలి
వరదలాగ సాగాలి

సంబరాలు చేయాలి
శ్రద్దలనే చూపాలి
విజయాలను పొందాలి
వినయాలు చూపాలి


కామెంట్‌లు