కవులకలాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కలాలు
ఉలులవలె
కవితాశిల్పాలను
చెక్కుతున్నాయి

కలాలు
కుంచెలవలె
కవనచిత్రాలను
గీస్తున్నాయి

కలాలు
హలాలువలె
కవితాసేద్యమును
చేస్తున్నాయి

కలాలు
మేఘాలువలె
కవితాజల్లులు
కురిపిస్తున్నాయి

కలాలు
అలలవలె
కవనతరంగాలను
సృష్టిస్తున్నాయి

కలాలు
మొక్కలవలె
కవితాకుసుమాలు
పూస్తున్నాయి

కలాలు
పిచికారీలవలె
కవితాసౌరభాలు
వెదజల్లుతున్నాయి

కలాలు
సూర్యునివలె
కవనకిరణాలు
ప్రసరిస్తున్నాయి

కలాలు
పాచకులవలె
కవితామాధుర్యాలను
అందిస్తున్నాయి

కలాలు
ప్రకృతివలె
కవనసౌందర్యాలను
కనబరుస్తున్నాయి

కలాలు
కత్తులవలె
కవనరంగమందు
క్రమంతప్పినవారిపైపోరాడుతున్నాయి

కలాలు
కవులశస్త్రాలు
కవితలు
మనోవికసితాలు


కామెంట్‌లు