నవ్వుతూ బ్రతకాలిరా !;- సి.హెచ్.ప్రతాప్
 1.“ఏవమ్మా కొంచెం భిక్షం వేయండి” అరిచాడు బిచ్చగాడు.
 
“ఇంకా ఇంట్లో భోజనాలు అవలేదు, కాస్సేపాగి రా” విసుగ్గా అంది ముత్యాలమ్మ.
 
“ అయితే నా సెల్ నెంబరు తీసుకోండి. అంతా రెడీ అవగానే ఒక్క కాల్ చెయ్యండి, వెంటనే వచ్చేస్తాను” వినయంగా చెప్పాడు బిచ్చగడు.
 
2.ఎందుకండీ ఆ చంటి గాడిని అంతలా బాదుతున్నారు? అడిగింది ఆండాళ్ళు.
 
“ వాడికి గాడిద బొమ్మ గీయమని వాడి టీచర్ చెప్పిందట. గాడిదను తెస్తే చూసి  గీస్తాడట అంటున్నాడు. వీడి దిక్కుమాలిన డ్రాయింగ్ కోసం నేను గాడిదనెక్కద తెచ్చేది? కోపంగా అరిచాడు వెంగళప్ప.
 
“ ఓస్ అంతేనా! ఈ మాత్రం దానికి గాడిద ఎందు కు? ఒక్క అరగంట పాటు మీరే వాడి ఎదుట నిలబడి వాడి చేత గీయిస్తే పోలా? వయ్యారం గా మూతి తిప్పుకుంటూ వంటింట్లోకి వళ్ళిపోయింది  ఆండాళ్ళు.
 
ఆ మాటలకు నోరు తెరుచుకొని వుండిపోయాడు  వెంగళప్ప.
 
3.“ఆంత అర్జంటుగా విడాకులుకు అప్లయి చేసావెందుకు ?” అడిగింది రేఖ.
 
“ మా ఆయన హఠాత్తుగా నెలకు బస్తా బియ్యం, అయిదు కేజీల కందిపప్పు, నాలుగు కేజీల నూనె ఇవ్వమని మా నాన్నకు ఫోన్లు చేస్తున్నాడు. ఆ వెధవకు ఇన్ని ఇవ్వడం కంటే విడాకులు తీసుకోవడమే బెటర్” చెప్పింది రాజీ.
 
4.నానా! నోట్స్లు కొన్నుకోవాలి, డబ్బులివ్వు” అడిగింది రజని.
 
“ఇప్పుడు చీకటి పడింది. ఆడపిల్లవు ఒక్కర్తీ బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. రేపు పొద్దున్నే వెళ్ళి కొనుక్కొ” ఆప్యాయంగా సలహా ఇచ్చాడు సుబ్బారావు.
 
“ రమేష్ కు రావడం ఇప్పుడే వీలవుతుంది నాన్నా” గబుక్కున అనేసి నాలిక కరుచుకుంది రజని.

కామెంట్‌లు