సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -536
తమఃప్రకాశ న్యాయము
*****
తమః అంటే చీకటి, నరకమందలి అంధకారము,మానస భ్రమ, త్రిగుణాలలో ఒకటి, దుఃఖము, పాపము. ప్రకాశ అనగా ప్రకాశించు, స్పష్టమగు,అగపడు, వెలుగు, సూర్య ప్రకాశము, కీర్తి అనే అర్థాలు ఉన్నాయి.
 
చీకటిని వెలుతురు అణచి వేస్తుంది అని అర్థము.
చీకటిని వెలుతురు అణచి వేయడం అంటే కేవలం సూర్యాస్తమయ సమయంలో వచ్చే చీకటిని వేకువ జామున ఉదయించే సూర్య కిరణాలు చీకటి తెరలను చీల్చడమనే అర్థం ఒక్కటే కాదు.
అజ్ఞానం,మూర్ఖత్వం, అహంభావం, కోపాలూ తాపాలూ అన్నీ చీకట్లే. అటువంటి వంటి చీకట్లపై అలుపెరుగని పోరాటం చేసి అణచి వేయడం.అంతే కాదు దుష్ట శక్తుల్లాంటి  ఆ చీకట్ల వల్ల  మనసుకు, శరీరానికే కాకుండా సామాజికంగా కూడా మంచిగా మనుగడ సాగించలేము.అందుకే వాటిని అణచి వేయడానికి, అదుపులో  పెట్టేందుకు నిరంతరం ప్రయత్నించాలి.
కవుల దృష్టిలో చీకటి వర్ణన,దానిని అణిచే  వెలుగు ఎలా ఉంటుందో చూద్దాం."నల్లని జుట్టును వీరబోసుకున్నట్టు ఆవరించిన నిశీధి రాకాసి ప్రపంచాన్ని అణగదొక్కేందుకు,‌అరాచకాలు ,అన్యాయాలు నిశాచరాలై పడగ విప్పుతూ ఉన్నప్పుడు వెలుతురు ఖడ్గం ఝళిపిస్తే,ప్రకాశమనే కొరడాను విదిలిస్తే ఎంతటి చీకటి రాజ్యమైనా కుప్పకూలి పోవాల్సిందే" అంటుంటారు.
ఈ చీకటి కేవలం బయట ప్రపంచంలోని ఉందా? లేదా మనసుల్లో, మనుషుల్లో ఉందా? ఒక్కసారి తరచి చూస్తే కొందరి మనసుల్లో, మరికొందరు మనుషుల్లో చిక్కని చీకటి లాంటి దుఃఖము,మానస భ్రమ, మోహం ఈర్ష్య, అసూయ లాంటివి ఆవరించి ఉండటం గమనించవచ్చు.
 దీనికి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
మరి కొందరి మనుషుల్లో, మనసుల్లో అజ్ఞానం, అవిద్య ,అహంకారం అనే చీకటి ప్రబలంగా వుంటుంది.
మరి అలాంటి చీకట్లను అణచి వేయాలంటే జ్ఞానమనే వెలుగు,విద్య అనే ప్రకాశం, నిరహంకారమనే సూర్య ప్రభ ఆయా మనసులు, మనుషులను ఆవహించాలి.ఆ ప్రకాశం యొక్క వెలుగు వల్ల విజ్ఞానిగా,వివేకిగా,జ్ఞాన మూర్తిగా మారి కీర్తి శిఖరాలను అధిరోహించగలడు.
 చీకటి వెలుగుల జీవితంలో వెలుగులను వీడి పోకుండా వుంటేనే మనమేంటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మానస భ్రమలు తొలగి పోతాయి.చీకటి దరి చేరని స్వయం ప్రకాశకులమై తేజోవంతమైన జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.
 ఇదండీ! "తమఃప్రకాశ న్యాయము"లోని అంతరార్థం.ఇది తెలిసిన మనం మనలో ఏ మూలనో దాగి ఉన్న అవలక్షణాల చిరు చీకట్లను తరిమేద్దాం. ప్రకాశమనే  ఆత్మ విశ్వాస శక్తిని స్వంతం చేసుకుని స్వయంప్రభలమై వెలుగుదాం.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం