మాతృదేవోభవ;- - యామిజాల జగదీశ్

  భారతీయ  సంస్కృతికి  వేదాలు ఆధారం. వేదాలలో తల్లి, తండ్రి,  గురువులను దేవతల  సమానులుగా, పూజనీయులుగా చెప్పబడిరది. ‘‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ’’  `  అను భావన భారతీయ సంస్కృతికి ప్రాణం వంటిది.
తల్లిదండ్రులు  ప్రత్యక్ష  దైవాలని  గ్రహించాలి. నిత్యం సేవించాలి.  వారు తృప్తి చెందితే, పార్వతీపరమేశ్వరులు 
ప్రీతి చెందినట్లే.
వేదవ్యాసుడు  అంటాడు కదా... తల్లిని మించిన గురువు మరెవరూ  లేరు.  మనుస్మృతి కూడా ఈ  విధంగానే బోధించింది. కనుక మనకు మరో ప్రత్యామ్నాయం  లేదు. అమ్మ అన్నది ఓ దివ్యమైన పవిత్రమైన వరం. ఒక అభయ పత్రం. ఆమె ఒక అనురాగ ఛత్రం.
 వాల్మీకి రామాయణంలో  మర్యాద  పురుషోత్తముడైన  రాముడు సీతాదేవితో తల్లి, తండ్రి,  గురువు  ఈ ముగ్గురు ప్రత్యక్ష దేవతలు.  వీరిని అవహేళనతో ఉపేక్షించి,  దేవతలను ఆరాధించడం ఉచితం కాదు. ఈ  ముగ్గురినీ సేవించడం వలన ధర్మ  అర్థ కామములు ప్రాప్తి చెందటమే కాక త్రిమూర్తులను  ఆరాధించి నట్లవుతుంది అని చెప్పాడు.  శ్రీరాముడు ఈ మర్యాదను తన  జీవితంలో  శ్రద్ధాపూర్వకంగా పాటించాడు.  తల్లి, తండ్రుల  ఆజ్ఞను  ప్రసన్నతతో  శిరోధార్యం చేసుకొని  పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. తల్లితండ్రుల  మాట జవదాటనందువల్లనే ఆ  మహనీయునికి నేటికీ ప్రతీ  యింటా పూజలు జరుగుతున్నాయి.
పద్మపురాణంలో తండ్రిని ధర్మమూర్తి అని, తల్లియందు  సర్వతీర్థాలు  ఉంటాయని చెప్పబడింది.  గణపతి,  కార్తికేయుల వివాదం,  దాని పర్యవసాన కథ అందరికీ తెలిసిందే.  భూప్రదక్షిణ చేయటానికి కార్తికేయుడు తన వాహనంపై  బయలుదేరగా,  వినాయకుడు  తన  తల్లితండ్రులను పూజించి, వారికి ముమ్మారు ప్రదక్షిణం చేసి , భూప్రదక్షిణం పూర్తి చేసినట్లుగా ప్రకటింపబడ్డాడు. తల్లితండ్రులకు అంత  ఉన్నతమైన స్థానం ఇఛ్చినందులకే వినాయకుడు అందరి చేత అగ్రపూజలందుకుంటున్నాడు.
ప్రాచీన కాలం నుండి  తల్లి,  తండ్రి, గురువులు సమాజంలో మహోన్నత స్థానంలో ఉన్నారు.  మనల్ని  కని,  పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి , సంఘంలో ఒక గౌరవ స్థానం కల్పించి,  మనకోసం ఎన్నో త్యాగాలు చేసిన  తల్లితండ్రులకు ఎంతో ఋణపడి ఉన్నాం. మన పెద్దలు మనల్ని ఏ విధంగా కని,  పెంచి,  సంస్కారవంతుల్ని చేశారో అలాగే  మనంకూడా ఉత్తమ  గృహస్థులమై  సద్గుణవంతులైన సంతానానికి జన్మనివ్వాలి. వారిని సంస్కారవంతుల్ని చేయాలి. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి,  దేశభక్తి, దైవభక్తి అనే పంచ  సౌశీల్యాలను బోధింఛి వారిని జాతి  గర్వించతగ్గ రత్నాలుగా తీర్చిదిద్దాలి. ఇలా  బిడ్డలను  పెంచడంలో తండ్రిది, గురుతరమైన బాధ్యత  ఉంటుంది. అయితే  అంతకంటే  మహత్తరమైన  బాధ్యత తల్లిది. తల్లిని మించిన నేర్పరి , శిక్షకురాలు, గురువు  ఎవరుంటారు? పిల్లలకి తల్లే  తొలి  గురువు.  ఆరంభంలో తల్లి ఒడే  పిల్లల బడి. 
అటువంటి  తల్లితండ్రుల శిక్షణలో  పెరిగిన  పిల్లలు పితృభక్తి  మాతృభక్తితో  లోకోత్తములవుతారు. పుండరీకుడు  తల్లితండ్రులకు చేస్తున్న సేవలకు మెచ్చి, విష్ణువు అతడిని చూడడానికి వెళ్ళాడు. తల్లితండ్రుల సేవలో  నిమగ్నమైయున్న  పుండరీకుడు విష్ణుమూర్తిని నిరీక్షించమని  ఒక ఇటుకరాయిని చూపించాడు. మహావిష్ణువు ఆ ఇటుకపై నిలిచాడు.  ఆ  ప్రదేశమే నేడు  పండరీపురమనే పేరుతో ప్రసిద్ధ  పుణ్యక్షేత్రంగా వెలిసింది.
పితృ వాక్య పరిపాలనలో అతి పిన్నవయస్సునందే  తన యౌవనాన్ని  తండ్రికి   సమర్పించిన పురూరవుడు, తండ్రి  ఆజ్ఞ  మేరకు తన కన్న కల్లి, శిరసును ఖండిరచిన పరశురాముడు, తండ్రి కోరిక  తీర్చుటకు ఆజన్మబ్రహ్మచర్యం  చేపట్టిన  భీష్ముడు , తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుటకు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం  చేసిన శ్రీరాముడు  తమ పితృభక్తి పరాయణత్వం వలన లోకోత్తములయినారు.
కంసుని చెఱసాల  నుండి, దేవకీ వసుదేవులవు విడిపించిన  తరువాత  బలరామ కృష్ణులు తల్లితండ్రులకు పాదాభివందనం చేసి, వారి పట్ల ఉన్న కృతజ్ఞతాభావాన్నిఇలా వ్యకపరచారు - ‘‘అమ్మా! నాన్నా!  మేం ఇన్నాళ్ళూ  మీ ప్రేమ, ఆప్యాయతలను  పొందే అదృష్టానికి  నోచుకోలేదు. ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి  అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు.  అటువంటి దుర్లభమైన  మానవ  దేహాన్నిచ్చిన మీ  రుణం  తీరడానికి నూరేళ్ళయినా  సరిపోదు’’ అని బలరామకృష్ణులు పలికిన మాటలు  వలన తల్లితండ్రుల స్థానం  ఎంతటి  ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఎటువంటి భయంకర  పరిస్థితి ఏర్పడినా బిడ్డలు తమ  తలితండ్రుల  వద్ద  మాత్రం  నిర్భయంగా ఉండగలుగుతారు. భూప్రదక్షిణ  ఆరుసార్లూ,  సముద్రస్నానాలు వందల సార్లూ, కాశీయాత్ర పదివేల సార్లూ  చేస్తే వచ్చే పుణ్యం  ` తల్లికి ఒక్కసారి  వందనం  చేయడంతోనే లభిస్తుందని నీతిశాస్త్రం మాట.
పిల్లల శ్రేయస్సుని ఆశించి వారి అభివృద్ధి కోసం అష్టకష్టాలనైనా ఆనందంగా అనుభవించే తల్లితండ్రుల రుణం వందల సంవత్సరాలు  శ్రమించినా తీర్చలేనిదని  చెప్తున్నదీ హితవచనం.
నేటి  సమాజంలో తలితండ్రులను ఆప్యాయతతో ఆదరించే బిడ్డలు అరుదయి పోతున్నారు.  జన్మనిచ్చిన  తల్లితండ్రులను ప్రత్యక్షదైవాలుగా చూడక పోయినా, వారిని హింసించి,  అవమానించకుండా ఉంటే, వారికి  ప్రదక్షిణలు, వందనాలు  చేసినంత పుణ్యం.
 పిల్లలు తల్లిదండ్రులను దుర్భాషలాడడం  అవమానించడం లాంటివి చేయకూడదు.  అలా  మాతా పితరులను అగౌరవపరచిన  వారికి  ఎన్నటికీ మేలు  జరుగదని ఆర్య ధర్మసూక్తి.
అందరి  వద్దా  భగవంతుడు ఉండలేకనే ‘అమ్మ’ను మనకందించాడు. వారికి ఆనందం కలిగించే  పనులు  చేస్తూ, వారిని వృద్ధాప్యంలో దయతో సేవలందించడం శ్రేయస్కరం. అంతేకాదు ` ఇది పిల్లల కనీస ధర్మం.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం