నిజం! అచ్యుతుని రాజ్యశ్రీ
 జులై1917 లో ఎల్సీరైట్  ఫ్రాన్సెస్ గ్రిఫిత్ అనే ఇద్దరు చిన్నారులు తాము దేవకన్యల్ని చూస్తూ  వారి తో  ఆడు కుంటున్నామని అందరికీ టముకు కొట్టారు. పైగా ఎల్సీరైట్ తండ్రి ఆరెక్కలున్న ఫెయిరీలతో ఆడే ఆపాపలకి ఫోటో లు తీసి లోకానికి చూపాడు.అలా 5 ఏళ్ల పాటు 5ఫోటోలతో ప్రపంచం నమ్మింది. శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకున్నా ఆఫెయిరీల అంతుచిక్కని కాలం అది.కానీ 1983 లో ఆ అమ్మాయిలు ఇలా గుట్టు విప్పారు " ఫోటోలో ఉన్న ఫెయిరీలు నిజమైనవి కావు.కార్డ్ బోర్డు తో తయారు చేసి న రెక్కల బుల్లి బుల్లి బొమ్మలు!" ప్రపంచమంతా నివ్వెరబోయింది ఆపిల్లల ఊహలు తండ్రి ఫోటోలు శుద్ధ అబద్దాల పుట్ట అని తెలుసు కుని!?!
అందుకే దెయ్యాల భూతప్రేతాల విషయాలు జనాలు నమ్మరు.కానీ చాలా మంది బుకాయిస్తారు" ఆకారం లేని తెల్లటి ప్రేతాత్మలు  తమతో మాట్లాడుతూ కావల్సిన పనులు చేసి పెడతాయి అని.మనిషి కోరికలు  ఊహలు అతనికి నచ్చిన వ్యక్తులు ఇలా ప్రేతాత్మలు గా కన్పడి కట్టుకథలు ప్రచారం చేస్తారు అని జనానికి భయం కల్గించి మంత్రతంత్రాలతో డబ్బు సంపాదించే ఎత్తు లని  శాస్త్రవేత్తల పరిశోధనలు అభిప్రాయం. అదొక రకం పైశాచిక ఆనందం మానసిక జబ్బు అని మనం భావించవచ్చు 🌹

కామెంట్‌లు