సుప్రభాత కవిత ; -బృంద
పాలమబ్బుల దారిలోన
తేలివచ్చు వెలుగుతేరు
నీలాల నింగిలోన వేసెనంట
రంగు రంగుల రంగవల్లి..

గిరుల జారిన కాంతిరేఖలు
గలగలమని గంతులేయు
జలపాతాలకు జిలుగుటంచుల
చీరలెన్నో చుట్టెనంట...

తెలిమంచు తెరలు తొలగి
చెలిమికై చేయి చాచిన
తొలివెలుగు కిరణాలు తాకి
పలువన్నెల పూలు విరిసెనంట...

కలతలు తొలగిన కాంతులేవో
మమతలు  పంచే నవ్వులతో
కన్నుల నిండుగ కోటి రవ్వల
మెరుపులేవో నింపెనంట...

బ్రతుకుదారిని సుగమం చేసే
కొత్తవెలుగుల బాటలో
కోటి ఆశలు  చిగురులేస్తూ
ఆనందపు గమనం సాగెనంట..

చెదిరిపోని నమ్మకమేదో
చేయిపట్టి  నడిపిస్తుంటే
గమ్యం చేరే గమనంలోనే
రమ్యమైన జీవితం దొరికేనంట..

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు