బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత;- సి.హెచ్.ప్రతాప్
తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహర్తంగా పరిగణిస్తారు.బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వత్తమమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. ఈ సమయంలని నిద్రలేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ఎవరికైనా మేలకువ వస్తే.. సృష్టి, దైవిక శక్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించాలని సూచిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఏదో ఒక దైవిక శక్తి మీకు సందేశం ఇవ్వాలనుకుంటుందని.. ఏదైనా వివరించాలని కోరుకుంటుందని పెద్దల నమ్మకం. భగవంతుడి నామాన్ని జపించాలి. ధ్యానం, జపం, చేయాలి.హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ అంటే దేవుడు. ముహూర్తం అంటే సమయం. అంటే బ్రహ్మ ముహూర్తం భగవంతుని సమయం. ఈ శుభ సమయంలో శరీరంలో కొత్త శక్తి, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. అలాగే ఈ సమయంలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.బ్రహ్మ ముహార్తంలో ప్రకృతి సానుకూల ప్రకంపనలతో నిండి ఉంటుంది ఈ సమయంలో భగవంతుడి తలచుకోవడం వలన మిమ్మల్ని ఆరోగ్యవంతం చేస్తుంది. హృదయం భక్తితో నిండి ఉంటుంది. సంపద కలుగుతుంది.
శ్లో: వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||
దీనర్థం ఓ వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారని తాత్పర్యం. అంతేకాకుండా శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుంది.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా అండ్ అలైడ్ సైన్సెస్ ప్రకారం , సూర్యోదయానికి ముందు కాలంలో, వాతావరణంలో కొత్త ఆక్సిజన్ లభ్యత ఉంది. ఈ కొత్త ఆక్సిజన్ హిమోగ్లోబిన్‌తో సులభంగా కలిసిపోయి ఆక్సిహెమోగ్లోబిన్‌ను ఏర్పరుస్తుంది, ఇది క్రింది ప్రయోజనాలను కలిగి ఉంటుంది:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శక్తి స్థాయిని పెంచుతుంది, రక్తం పి హెచ్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది, నొప్పి, నొప్పి మరియు తిమ్మిరి నుండి ఉపశమనం పొందుతుంది మరియు ఖనిజాలు మరియు విటమిన్ల శోషణను మెరుగుపరుస్తుంది. 

కామెంట్‌లు