రామవనవాసం! అచ్యుతుని రాజ్యశ్రీ
 వాల్మీకి మహర్షి ప్రకృతి శోకాన్ని ఎంతో అందంగా వర్ణించారు.గాలి వ్యాకుల పడ్తోంది. పక్షులు మేతకు వెళ్లలేదు.గుర్రాలు ఏనుగులు కన్నీరు కారుస్తూ నిలబడితే సుమంతుని "త్వరగా రథం పోనీయండి" అన్నాడు రాముడు.కౌసల్య దశరథుడు వాకిలి దాకా రామా రామా అని ఏడుస్తూ వచ్చారు." కౌసల్యా! నేను మోదుగు చెట్టు పూలను చూసి మురిసి మామిడి తోటలను నరికిన మూర్ఖుడను.కైక వ్యామోహం లో పడి సర్వనాశనం చేసిన పాతకిని."అని ఏడుస్తూ " నీవు నన్ను పట్టుకో.రాముని తల్లి గా నీస్పర్శ తో దుఃఖం కాస్త తగ్గుతుంది" అన్నాడు.వృద్ధబ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రాలను మోస్తూ అర్థం వెంట పరుగులు పెడుతూ ఉన్నారు." మేము నడుస్తాం.జనమంతా ఆవృద్ధబ్రాహ్మణులు పరుగులు పెడుతున్నారు" అని సీతతో సహా రామలక్ష్మణులు దిగి నడిచి తమసా తీరంలో నిద్రపోయారు.అంతా ఆదమరిచి నిద్రలో ఉన్న సమయంలో సుమంతుడు రాముని ఆనతిపై రథం నడిపాడు."జనం రథచక్రాలు చూసి మనం వెళ్లే చోటుకి వస్తారు.అలా రాకుండా ఉత్తర దిశగా పోనివ్వు.మళ్ళీ వెనక్కి తిప్పి గడ్డిపై తమసానదివైపు నడుపు.మనం అయోధ్యకి తిరిగి వెళ్ళాంఅనే భ్రమలో వారు రథచక్రాల గుర్తులు కానరాక వెళ్లి పోతారు.కోసలరాజ్యసరిహద్దుల్లో గ్రామ అధిష్ఠానదేవతను ప్రార్థించి కోసలరాజ్య సరిహద్దు దాటారు ఆముగ్గురు.సుమంతుడు బాధతో ఖాళీరథంతో వెళ్తే గుహుడు ఉండే శృంగిదేవపురం చేరారు.రాముని విచక్షణ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సీత లక్ష్మణుడు ప్రేమ తెలుస్తోంది కదూ?🌷

కామెంట్‌లు