అవయవ దానం ప్రాశస్థ్యం ;- సి.హెచ్.ప్రతాప్
 ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవయవ దానం చేసే దేశాల్లో భారత్‌ ఒకటిగా కొనసాగుతోంది. భారతదేశంలో, అవయవ దానం రేటు చాలా తక్కువగా ఉంది.అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.మన దేశానికి ప్రతి ఏడాదికి సుమా రు మూడు లక్షల మంది నేత్ర దాతల అవసరమున్నది. కానీ అతికష్టం మీద యాభై వేల మంది మాత్రమే లభిస్తున్నారు. మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నా, అవయవ దానం చేసేవారి సంఖ్య ఆ స్థాయిలో ఉండటం లేదు. వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు గల సాంప్రదాయపు ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహనాలోపం తదితర కారణాల వల్ల నేత్రదానం చేయడానికి అందరూ అంగీకరించకపోవడం వల్ల పవిత్రమైన అవయవదాన ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.అవయవ దానం మానవ శరీర పరిశోధన కు ఉపకరిస్తుంది. వైద్య విద్యార్థులకు శరీరం లోని అవయవాల పని తీరుపై అవగాహన కల్పిస్తారు. వైద్యశాస్త్ర అభివృద్ధికి ఉపకరిస్తుం ది. అవయవ దానం ద్వారా కొత్త జీవితం లభిస్తుంది.అవయవ దానం అవశ్యకత ను అందరం గుర్తించేలా ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున ఉపక్రమించాలి. అవయవాలు అందుబాటులో లేక ఎందరో రోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అవగాహనాలోపం, అపోహలు అవయవదానానికి ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. మనకు అవసరం వచ్చినప్పుడు కాకుండా అందరి కోసం అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. జీవన్‌దాన్‌లో పెద్ద సంఖ్యలో దాతల పేర్లు నమోదయ్యేలా చూడాలి. మనకు తెలిసిన వారు బ్రెయిన్‌డెడ్‌ అయిన సందర్భాల్లో వారి కుటుంబాలను ఒప్పించి అవయవాలను దానం చేయించాలి.మూత్రపిండాలు, కళ్ళు, కాలేయం, గుండె, చర్మ కణజాలాలు, చిన్న ప్రేగులు మరియు ఊపిరితిత్తులు సాధారణంగా ప్రజలు దానం చేసే కొన్ని అవయవాలు. అవయవ దానంలో పాల్గొనడం అనేది దాతృత్వం మరియు సామాజిక సేవ యొక్క గొప్ప రూపం. ఇది మరణం తర్వాత వ్యక్తుల సహకారాన్ని సూచిస్తుంది. మనమందరం ప్రాణాలను కాపాడేందుకు మన అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి మరియు వివిధ ప్రచారాలలో పాల్గొనడం ద్వారా అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయాలి.అవయవ దానం అనేది జీవితాలు, కుటుంబాలు మరియు సమాజాలను మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అసాధారణ బహుమతి. అవయవ దానం యొక్క క్లిష్టమైన అవసరాన్ని అర్థం చేసుకోవడం, అపోహలను తొలగించడం మరియు దాతగా మారడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం ద్వారా, వ్యక్తులు తమ స్వంత జీవితాలను అధిగమించే శాశ్వత ప్రభావాన్ని వదిలివేయవచ్చు. ఈ దయతో కూడిన చర్య ద్వారా, నష్టం యొక్క విషాదాన్ని మనం పునరుద్ధరించిన జీవితం యొక్క ఆశగా మార్చగలము. 

కామెంట్‌లు