కీర్తికి పర్యావరణ దినోత్సవ సత్కారం
 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ సంస్థ అధ్యక్షురాలు డా.కుప్పిలి కీర్తి పట్నాయక్ కు ఘన సన్మానం జరిగింది.   
కీర్తి సంస్థ తరపున 150మొక్కలను జీయో ట్యాగ్ చేస్తూ, సదరు దస్త్రం ఆవిష్కరణ జరిగిన సందర్భంలో ఆమెకు ఈ సత్కారం లభించింది. 
ఇండియన్ నేవీ కెప్టెన్ శివాజీ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం ఎంతో ఆనందంగా ఉందని కీర్తి తెలిపారు. 
గతంలో అనేక సార్లు తమ సంస్థ తరపున వేలాది మొక్కల నాటే కార్యక్రమాలు నిర్వహించామని, నేడు ఈ డేగా సంస్థ ఆవరణలో మొక్కలు నాటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో  కెప్టెన్ శివాజీ యాదవ్ మాట్లాడుతూ కీర్తి పట్నాయక్ ఆధ్వర్యంలో వారి సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాలు ఆపద్బాంధవుల్లా ఆదుకొనే ఘనమైనవని, కష్టజీవుల పట్ల కరుణ కలిగిన విలువైనవని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సేవా పథకాలకు తోడ్పాడునందించే ఆదర్శప్రాయమైనవని అన్నారు. 
అనంతరం శివాజీ యాదవ్, వారి ప్రతినిధుల బృందం కీర్తి పట్నాయక్ ని అభినందిస్తూ డేగా సంస్థ బ్యాడ్జ్, టోపీ, కానుకలను బహూకరించి ఘనంగా సత్కరించారు.
కీర్తి సేవలకు గుర్తింపుగా ఆమెకు జరుగుతున్న ప్రోత్సాహక సత్కారాల, పురస్కారాల పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.

కామెంట్‌లు