సార్థక నామధేయుడు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పాత్రికేయవీరుడు నార్లవారి వారసుడు
పత్రికారంగంలో పద్మశ్రీ సమ్మానిత యోధుడు
పదివేలకు పైబడిన
అధ్యక్షోపన్యాస దురంధరుడు
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
ప్రస్తుతించిన మాన్యుడు
కళాప్రపూర్ణ, గార్డియన్ ఆఫ్ తెలుగు,
వరల్డ్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు,
నేషనల్ సిటిజన్ అవార్డు, ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్
లాంటి పురస్కారాలు ఆయనను
వెతుక్కుంటూ వచ్చినవే
పదునాలుగేండ్ల ప్రాయంనుండే పత్రికా రంగంలో
అకుంఠిత దీక్షతో పనిచేసిన లబ్ధప్రతిష్టుడు
తెలుగుభాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి కోసం
అలుపెరుగని పోరాటం చేసిన అద్వితీయుడు
మానవీయ దృక్పథంతో జగమంతా
తన కుటుంబమని భావించిన
కుటుంబరావు సార్థకనామధేయుడే సుమా!!
**************************************

కామెంట్‌లు