స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 సోమవారం! పిల్లలు బిలబిలలాడుతూ ప్రార్ధన కై గ్రౌండ్ లో చేరారు. యోగా చేశాక ప్రార్థన  ఆపై వార్తలు ముగించి క్లాస్ లో కెళ్ళారు.లంచ్ ముందు  టీచర్  ఓ చిన్న ప్రశ్న అడిగింది " పేపర్ ఎంత మంది చదువు తున్నారు?" కేవలం శివా విజయ మాత్రమే చేతులెత్తారు.మీకు స్ఫూర్తి దాతలు ఎవరు? టీచర్ ప్రశ్నకు శివ చెప్పాడు" టీచర్! బాసుకనోజియా అనే ఆమె లేడీ సింగం గా అడవులను కాపాడుతూ ఎకోవారియర్ బహుమతి పొందారు. ఆమె ఫారెస్ట్ ఆఫీసర్ గా అటవీ భక్షకులపాలిట కాళీమాతగా తన ప్ర తాపం చూపుతున్నారు.అటవీ మాఫియా బెదిరింపు వారితో కుమ్మకయ్యే ప్రభుత్వోద్యోగులబెదిరింపులు లెక్కజేయని బాసుకనోజియా కీ జై" అన్నాడు శివఇక విజయ చెప్పింది"ప్రధాని మోదీజీ ప్రమాణస్వీకారం కి హాజరైన ఐశ్వర్య మీనన్ సురేఖ యాదవ్ నాకు స్ఫూర్తి దాతలు. వందేభారత్ ఎక్స్ప్రెస్ కి లోకోపైలెట్స్.ఆసియా లోనేతొలి మహిళా పైలెట్ గా మన దేశం లో తొలి మహిళా రైలుడ్రైవర్ గా వందేభారత్ ఎక్స్ప్రెస్ కి మొదటి మహిళా లోకోపైలెట్ సురేఖాయాదవ్.నేను ఈపుస్తకంలో ఇలావారిఫోటోలు సమాచారం అతికించి ఆల్బం చేస్తున్నా టీచర్!".శభాష్! క్లాసంతా చప్పట్లు కొట్టారు. లంచ్ బెల్ మోగింది🌹
కామెంట్‌లు