శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
881)రవిః -

సూర్య విభూతి గలిగినవాడు 
సర్వరస పోషణము చేయువాడు 
ప్రాణుల జీవము తానైయున్నవాడు 
రవి కిరణముల వెలుగువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
882)విలోచనః -

వివిధరూపముల ప్రకాశకుడు 
విశ్వమును పరికించునట్టివాడు 
సర్వవిషయములు చూచువాడు 
విలోచన నామమున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
883)సూర్యః -

ప్రాణులకు జీవమును యిచ్చువాడు 
వెలుగులరేడు తానైనవాడు 
జీవశక్తిని ప్రసాదించువాడు 
తిమిరమును తొలగించేవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
884)సవితాః -

సర్వలోక సృజనము చేయువాడు 
సమస్త జగతి మూలకారకుడు 
లోకములనుత్పన్నము చేసేవాడు 
విశ్వముకు తండ్రివంటివాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
885)రవి లోచనః -

సూర్యనేత్రములు గలిగినవాడు 
కన్నులలో తేజస్సు ఉన్నవాడు 
రవికిరణముల చూపున్నవాడు 
భానుప్రకాశ నేత్రములవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు