'శంభో!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 కందములు.
=========
36.
ఆపద కల్గిన వేళల 
నీపద యుగళము దలంతు నిర్మల హృదిలో 
కాపును గాయగ నరుగిడి 
తాపము దీర్పవె !పశుపతి !దయగొని శంభో !//
37.
నిరతము నీపద రజమును 
సురమును లెల్లరు ధరించి శుద్ధాత్మలుగా 
చరియింతురీ జగంబున 
ధరియింతు విభూది వలెను దయగొను శంభో !//
38.
 హరి వాగీశులు సతతము 
పరి వారము తోడ నిన్ను  బ్రణతుల గొల్వన్ 
కరుణించెద వట నీవే 
పరి పరి విధముల భజింతు వరమిడు శంభో !//
39.
వెన్నుడు పుత్రుని బడయఁగ 
నిన్నే శరణని తపములు నిష్ఠగ సల్పన్ 
జిన్నారి నొసగిన హరా!
జెన్నుగ సతతము సలిపెద సేవలు శంభో !//
40.
 హిమగిరి తనయను జేకొని
కమనీయముగా జగతిని గాచెడి భధ్రా!
సుమముల తోడ నిను గొలుతు
నమరిక గా నీ దినమున హరహర శంభో!//

కామెంట్‌లు