సుప్రభాత కవిత ; -బృంద
కోరిన ఉదయపు వెలుగులు
తీరిన ఆశల ఎదురుచూపులు
మారిన జగతిని అందంగా
చేరిన వెలుతురు కిరణాలు

గాయం చేసిన గతాలన్నీ
మాయం చేసే మందులు పూసి
న్యాయం తప్పక నడచుకుంటూ
ధ్యేయం వైపుగా అడుగులు

నిన్నటి కలతల నీడలకు
మొన్నటి కష్టపు వెతలకు
అన్నిటికీ వీడ్కోలంటూ
అందరినీ ఒక్కటి చేసే స్నేహాలు

తిరస్కారాలు పురస్కారాలుగా
అవమానాలు అభిమానాలుగా
అపజయాలన్నీ దిగ్విజయాలుగా
మార్చుకున్న  దృఢ నిశ్చయాలు

రంగుల వెలుగుల రేపటి కోసం
చీకటి రెప్పల తెర  తొలగించి
ఆశగ చూసే అశ్రునయనాలకు
అందివచ్చిన అపురూపమైన వేకువ

అందలమెక్కించిన అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు