మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు
 ఉరుములు విశేషంగా ఉంటాయి చెవులు  దిబ్బడి పడతాయి  ఎవరి మాట ఎవరికీ వినపడదు మెరుపులు పిడుగులు కలిగి ఉంటాయి పిడుగులు వల్ల  కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి వెంటనే గరుడారూడుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా  చెప్పాడు  స్కంద పురాణంలో చెప్పిన విషయం  ఇది నేను నీకు ప్రత్యక్షమైన  రోజున మకర మాస పుష్యమి నక్షత్రంలతో కూడుకొనిన పూర్ణ మాస్య దివసమున తీర్థములో స్నానము చేయు దేవతలు మనుషులు మొదలగు వారికి సర్వ పాపములు పోతాయి ఇకమీదట ఈ తీర్థం రామకృష్ణ తీర్థము అని లోకములో ప్రఖ్యాతి చెందుతుంది  ఈ శుభ దినాన వందల కొలది చేనులు స్నానానికి తీర్థానికి వెళతారు దేవస్థానం నుంచి ప్రసాదాలు మొదలగునవి పంపబడతాయి  దేవస్థానం సిబ్బంది అర్చకులు మొదలగు వారందరూ వెళతారు అక్కడి నుంచి కృష్ణ విగ్రహానికి అభిషేకాలు దేవస్థానం నుంచి తీసుకురాబడిన ప్రసాదం ఆరగింపై వినియోగం చేయించబడుతుంది
ఈ దేవస్థానంలో ప్రసిద్ధికెక్కిన విజయనగర రాజులైన కృష్ణదేవరాయలు వీరిద్దరిభార్యలు వీరి తమ్ముడు వెంకటపతి రాయుడు యొక్క విగ్రహాలు  తోడరమల్లుని భార్య మంత్రి మంత్రి భార్య యొక్క విగ్రహాలు ఉన్నాయి  ఇంకా రెండు ఉన్నాయి కానీ ఎవరో తెలియదు  అవి శ్రీకృష్ణదేవరాయల సవతి తమ్ముడైన అచ్యుతదేవరాయలు ఆయన రాణి వరదాజి అమ్మన్ లవి అప్పట్లో దిట్టం నామాలతో తిరుమల రాయుడు ఉండేదట ఆ విగ్రహం ఇదేనని కొంతకాలం నైవేద్యాలు కూడా పెట్టారట తర్వాత తప్పు తెలిసింది తిరుమల రాయుడు ఆయన కుటుంబ విగ్రహాలు ప్రత్యేకంగా లేవు  తిరుమల రాయల మండపం మొదటి వరస స్తంభాల మీద  వాటిని చెక్కాపారు  అది చాలామందికి తెలియదు
ఇతని భార్య కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులనియు దేవస్థానానికి మహోపకారం చేశాడని వదంతి కానీ దృష్టాంతరంగా మనకు శాసనాల రూపంగా ఏమీ మనకు తెలియదు  ఈ దేవస్థానం అనాది అనియు శ్రీమహావిష్ణువు శ్రీ వైకుంఠము నుండి దయచేసి రట ప్రసిద్ధ  పురాణ కథ  చరిత్రకారులు ఈ దేవస్థానం గురించి ఏమి రాసారు అను మొదలగు సంగతులు వినుటకు ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ  కొంచెం ఇక్కడ వివరించాలనుకుంటున్నాను.


కామెంట్‌లు