నవ్వుతూ బ్రతకాలిరా !!!!- సి.హెచ్.ప్రతాప్
 1.  ఒక కాలేజీ బయట " వాహనాలు నెమ్మదిగా నడపండి,విధ్యార్ధులు జాగ్రత్త" అన్న బోర్డును ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ వారు పెట్టారు. ఒక ఆకతాయి స్టూడెంట్ దాని పక్కనే లెక్చరర్ల కోసం వెయిట్ చెయ్యండి" అని రాసాడు.
2. దేవుడు తను ఏక కాలంలో అనేక ప్రదేశాలలో వుండలేడు కావున అమ్మను సృష్టించాడు.దయ్యం తాను ఏక కాలం లో అన్ని చోట్లా వుండలేదు కాబట్టి అత్తగారిని సృష్టించింది.  
3. వెంగళప్ప: "  డాక్టర్,ఈ కళ్ళద్దాలు వాడడం మొదలెట్టాక నేను చదవడం మొదలెట్టగలనా ?"
డాక్టర్ : " ఓ ఎస్, నిరభ్యంతరంగా !"
వెంగళప్ప: "నేను మీకు చాలా రుణపడి వున్నాను డాక్టర్, ఎందుకంటే నాకు ఈ రోజు దాకా చదవడం రాదు."
 
4. జేంస్ బాండ్ లాస్ ఏంజెల్స్ లో ఒక తెలుగు విధ్యార్ధిని కలిసి షేక్ హాండ్ ఇచ్చి " అయాం బాండ్, జేంస్ బాండ్, వాట్ ఈస్ యువర్ నేం"అని అడిగాడు.
ఆ విద్యార్థి వెంటనే చిరునవ్వుతో "అయాం నాయుడు, వెంకట నాయుడు... లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... కేతరాన్య బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... కేతరాన్య బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...ఇప్పుడు నా పేరు తిరిగి చెప్పండి " అన్నాడు.
ఆ మాటలకు జేంస్ బాండ్ కళ్ళు తిరిగి ఢామ్మని పెద్దగా శబ్దం చేస్తూ కింద పడిపోయాడు.    
5. సుధీర్  :"నేను రేఖకు ఏప్రిల్ ఒకటో తేదీన పెళ్ళి ప్రపోజల్ చేద్దామనుకుంటున్నాను"
సుశీల్ :" చాలా విచిత్రంగా వుంది.ఆ రోజునే ఎందుకు చేద్దామనుకుంటున్నావు ?"
సుధీర్  :" ఏముంది వెరీ సింపుల్. ఆమె నా ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసిందనుకో నా అదృష్టం గా భావిస్తాను. ఒక వేళ రిజెక్ట్ చేసిందనుకో ఏప్రిల్ ఫూల్ అని అనేసి ఎంచక్కా వచ్చేస్తాను"

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం