కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు

 🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 
----------------------------------------
అంగం హరే ఫులకభూషణ మాశ్రయంతీ
భృంగాంగ నేవ ముకుళాభరణం తమాలమ్ !అంగీ కృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయా !
భావం:
      ఆడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై
 వాలినట్లుగా దేవత యొక్క ఓర చూపు నీల మేఘ శ్యాముడైన భగవాన్ విష్ణుమూర్తి పై ప్రస
రించినప్పుడు, తొడిగిన మొగ్గల వలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినచో
అష్ట సిద్దులను వశీకరించుకున్న ఆ శ్రీ మహాలక్ష్మి 
భగవతి సంతరించును గాక !
                      *****

కామెంట్‌లు