శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
871)అభిప్రాయః -

అభిలాషగలిగినట్టి వాడు 
అభిప్రాయమును తెలుపువాడు 
తన్ను అభిలషించు వారున్నవాడు 
అభిమానులను గలిగినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
872)ప్రియార్హః -

ప్రేమపాత్రునిగా నుండినవాడు 
భక్తులకు దగ్గరివాడైనవాడు 
సాధుజన ప్రేమపాత్రుడైనవాడు 
ప్రియమైన విధంగా నున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
873)అర్హః -

అర్పించబడుటకు తను అర్హుడు 
కొలువుచేయ అర్హతగలవాడు 
పూజింప యోగ్యతగలవాడు 
భక్తులకు తగినట్లున్నవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
874)ప్రియకృత్ -

భక్తులకానందము నిచ్చువాడు 
ఆశ్రయం కల్పించగలవాడు 
ప్రియమైన కర్మలను చేయువాడు 
సజ్జనులను కాపుదల చేయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
875)ప్రీతివర్థనః -

భగవంతునిపై ప్రీతినిల్పువాడు 
భక్తులును ఆదరించునట్టివాడు 
అనుసంధానము చేయగల వాడు 
ప్రియమును వర్థిల్లజేయువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు