నవ్వుతూ బతకాలిరా !!!!సి.హెచ్.ప్రతాప్)
 1. మీ నాన్నగారి వయస్సు ఎంత ?" గోపిని అడిగింది టీచర్.
"నావయసే టీచర్. తొమ్మిదేళ్ళు" చెప్పాడు గోపి.  
"ఇద్దరిదీ ఒకటే వయసా? అదెలా సాధ్యం రా" అడిగింది టీచర్.
" నేను పుట్టినప్పుడే ఆయన నాన్న అయ్యారు టీచర్" అసలు సంగతి చెప్పాడు గోపి.
2."పెళ్ళి చేసుకోబోయే బ్రహ్మచారులు చాలా మంది పెళ్ళయిన వారిని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవడం మంచిదా అని అడుగుతుంటారు. ఇదంతా వట్టి ట్రాష్,భ్రమ, ఎందుకంటే ఇది ఆత్మ హత్య చేసుకోవడం మంచిదా లేక హత్య చేయబడడం మంచిదా అని అడిగినట్లుంది.
3 “.పెళ్ళయిన మొదటి సంవత్సరం లో భర్త మాటాడితే భార్య వింటుంది. రెండో సంవత్సరం లో భార్య మాట్లాడితే భర్త వింటాడు. మూడో సంవత్సరం నుండి ఇద్దరూ మాట్లాడుతారు కానీ పక్కింటివారు  వింటుంటారు. పదో సంవత్సరం నుండి ఎవరూ మాట్లాడరు.
4.“ఏవమ్మా !గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాలని నిన్న హాఫ్ డే లీవ్ తీసుకున్నావు, కానీ సాయంత్రం ఐమాక్స్ థియేటర్ లోనుండి ఎవడితోనో వస్తూ కనిపించావు. ఏం తమాషాగా వుందా “అరిచాడు మేనేజర్ బ్రహ్మానందం
“నేనేం అబద్ధాలు చెప్పలేదు, మీరు చూసినాయన నా బాయ్ ఫ్రెండ్, వృత్తి రీత్యా గైనకాలజిస్ట్” వయ్యారాలు వొలకబోస్తూ అసలు సంగతి చెప్పింది స్టెనో లూసీ. 

కామెంట్‌లు