కైక మొండితనం! అచ్యుతుని రాజ్యశ్రీ
 దశరథుడు  తనకు ఇచ్చిన రెండు వరాలప్రకారం రాముడు వెంటనే అడవికి వెళ్ళాలని శాసించింది కైక.పాపం మహారాజు ఎంతో కాళ్ళవేళ్ల పడ్డాడు.పితృవాక్యపరిపాలన కై రాముడు సీత తమసమస్త సంపద నగలుతో సహా దానం  చేశారు. పాదచారులుగా కైక  భవనానికి వెళ్తే తన  350 మంది రాణులు కౌసల్య సుమిత్ర లను కూడా రప్పించాడు దశరథుడు. కనీసం వారిని  చూసైనా బుద్ధి మార్చుకుంటుంది అనుకున్న ఆయన ఆశ నిరాశే ఐంది. సుమంతుడు అప్పుడు కైకని ఇలా తూలనాడుతాడు:" నీకు తల్లి బుద్ధి వచ్చింది.మహారాజు ఏడుస్తూ ఉంటే నీకు జాలికలగటంలేదా?   మీనాన్న  కేకయరాజుకి అన్ని ప్రాణుల భాషలు తెలుసు. ఒకరోజు జుంభ అనే చీమ ఇంకో చీమతో మాట్లాడుతూ ఉంటే మీనాన్న ఫక్కున నవ్వాడు. మీతల్లి ఆ చీమల సంభాషణ తనకు చెప్పమంది.అది చెప్పితే  తనతల వెయ్యి వక్కలౌతుంది అని మీనాన్న అన్నాకూడా " నాకు చెప్పి తీరాలి " అని మొండి కెత్తిన ఆమె కూతురు వి కదూ? రాముని విడిచి పెట్టి తను ఉండలేనని ఏడుస్తున్న రాజు పై నీకు దయలేదా?"  అని నిగ్గదీశాడు సుమంతుడు.దానికి కైక ఏమన్నదో తెలుసా? ఇక్ష్వాకువంశంలో రాజులు ఆడిన మాట తప్పరు.సగరుడు తన కొడుకు ని అడవికి పంపాడు కదా అని ప్రశ్నించింది వాడు తోపిల్లలని సరయూనదిలోకి తోసి హింసించేవాడు. చెడ్డ వాడు కాబట్టి అడవికి పంపాడు  అని సుమంతుడు అన్నా వశిష్ఠుడి మాటలు కూడా ఖాతరుచేయని కైక ని పల్లెత్తు మాట అనకుండా నారచీరలు ధరించి సీతారామ లక్ష్మణులు అడవికి బయలుదేరారు.కైక పై వ్యామోహం దశరథుడికి మనశ్శాంతి లేకుండా చేసింది. ముసలితనం లో గయ్యాళి భార్య కైక వలన ప్రాణాలు కోల్పోయాడు దశరథుడు 🌷

కామెంట్‌లు