సుభిక్షం...! - కోరాడ నరసింహా రావు
 ఏ ఋతువు లో వీయాల్సిన పవనాలు 
ఆ ఋతువులోవీయాల్సిందే...! 
 ఎదురు చూసిన అతిధి లా
 నైఋతి ఋతు పవనాలు
 వేళ మించిపోకుండ వస్తేనే ముద్దు...!!
 తొలకరి వానలతో  పుడమిపులకించి పోవాలి! 
 నాగళ్ల తో రైతు ఆనంద తాండ వం చేయాలి నేలతల్లి  పు రి టి
 నొప్పులతో... క్రొత్త పంటనుపురుదు పోసు కోవాలి!! 
 పవనం సహకరించనిదేమబ్బు
కనిక రించలేదు... 
 మబ్బు కనికరించనిదే చినుకు రాలదు... 
 చినుకు లేనిదే... ప్రాణి కోటికీ బ్రతుకు లేదు...!! 

ఆరు ఋతువులూ అందగి స్తేనే... మనిషి బ్రతుకు మంద గించ కుండా.. ముందుకు సాగేది..!! 

ఆకాల వర్షాలతో ప్రకృతి... 
 మసమీద పగ బట్టి0ది అనుకుంటే... 
 మనం పొర బడ్డట్టే...!! 

ప్రకృతి కి మనమీదున్నది... 
  పగ కాదు... ప్రే మ...! 
 క్రోధం కాదు... ఆక్రోషమ్...!! 
 తన సహజ సంపదనంతా
 సర్వ నాశనం చేసేస్తే... 
   చూన్తూ చేతులు కట్టుకు కూ చోవాలా... !? 
 మితి మీరిన అతి సుఖాాలకు
 తనను బలి చేస్తుంటె ... 
 మనకు విందు భోజనాలందించాలా...?! 
ఓ మనిషీ... నువ్ ముందు ప్రకృతిని ప్రేమించు... 
  నీ కన్న బిడ్డలా లాలించు...! 
అపుడే... ఈ ప్రకృతి... 
ఆహ్లాద భరిత ఋతు పవనాల రూపు దాల్చి... నిన్ను పలకరించి, పులకింప జేస్తది , 
 నీ నట్టింట నడయాడే... 
  చిట్టి పాపయై... 
 నీ యింట సిరుల పంట కురిపి స్తది...! 
 అపుడే... ....!! 
    ********

కామెంట్‌లు