కవిగారి కవితలకమామిషు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అందమే కవికి ప్రకంపనం
హృదయానికి స్పందనము

ఆనందమే కవికి గమ్యం
మనసుకు ఉల్లాసం

స్వప్నమే కవికి ప్రేరణం
కలముపట్టుటకు కారణం

అక్షరాలే కవికి ముత్యాలు
అందంగా అల్లటమే ధ్యేయము

పదాలే కవికి ముఖ్యం
పొసగటమే ప్రావీణ్యం

భావమే కవితకి ప్రాణం
పాఠకులకు ప్రమోదం

ప్రాసలే కవితకి ఆకర్షణం
వినటానికి మాధుర్యం

పోలికలే కవితకి బలం
మనసును తట్టటానికి మూలం

పొగడ్తలే కవికి ఉత్తేజం
కవనసాగింపుకు కీలకం

సన్మానాలే కవికి ప్రోత్సాహం
సాహిత్యసేవచేయుటకు నిరాటంకం


కామెంట్‌లు