సప్త స్వరముల...... ;- కోరాడ నరసింహా రావు
పల్లవి  :-
స రి గ మ ప ద ని స...... 
 సప్త స్వర సంగీతమే... 
  సృష్ఠిలోని అణు వణు వు
  నిండినది...! 
  రాగ, భావ ,తాళ ,గమకముల
  జంత్ర వాద్య విణ్యాసముల... 
 డోలాయ మానముగ ఓల లాడించి 
    రసహృయముల రంజింప జేయు.... 
    ఈ సప్త స్వర సంగీతమే.... 
   సృష్ఠిలో ని... 
 అణు వణు వు  నిండినది!! 
   "స రి గ మ....... "
చరణం  :-
సిసువులు , పసువులు... 
 పాములైనను పర వసించి
   తల లూచును... ! 
   వీచే గాలి లో... పారే నీ టి లో
 నవ్వులొ , ఏడ్పులొ వినిపించే ప్రతి ధ్వని లో.... 
 సప్త స్వర ముల సంగీతమే... 
 సృష్ఠి సమస్తము సంగీతమయ మే... 
    " స రి గ మ ప ద ని స
    సంగీతమే..సృష్టి సమస్తము
  నిండి యున్నది...!! 
చరణం :-
     శారీరక , మానసిక రోగము లెన్నిటికో వైద్యమైనది...! 
 ఉల్లా సమును ఉత్సా హమును కలిగించునది... 
 ఆరోగ్య ప్రదాయిని ... 
 సాహిత్య మునకు , నాట్యము నకును ఆలంబనయై అలరారు చున్నది....!! 
 " స రి గ మ ప ద ని స.... "
      *******

కామెంట్‌లు