శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
921)వీతభయః -
=============
భయమునెపుడు పొందనట్టివాడు 
అధైర్యమును విడిచినవాడు 
ధీరగంభీరుడు అయినట్టి వాడు 
విహ్వలతఅనునది లేనివాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
922)పుణ్యశ్రవణ కీర్తనః -

తనగూర్చి విన్నవార్నిబ్రోచువాడు 
కీర్తించువారికభయమిడువాడు 
భక్తులకనుకూలమైన వాడు 
భజనకు పరవశించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
923)ఉత్తారణః -

సంసారసముద్రము దాటించువాడు 
ఉద్ధారకునిగా నుండినవాడు 
ఈతిబాధలను తొలగించువాడు 
ఉత్తమగతుల నిచ్చుచున్న వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
924)దుష్కృతిహా -

సాధకుల లోపాలు హరించువాడు 
చెడువాసనలు తొలగించువాడు 
భక్తులను శుద్ధిచేయగలిగినవాడు 
పవిత్రంగా నుంచుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
925)ప్రాణః -

ప్రాణులకు పవిత్రతనిచ్చువాడు 
జీవదాతగా నిలిచియున్నవాడు 
ప్రాణశక్తిని ప్రసాదించెడివాడు 
ఊపిరిని కలిగించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు