నా ఆలోచన;- చిరసాని శైలూషి,నెల్లూరు
 నిజానికి సాకారమో నిరాకారమో మనం నిర్ణయించగలమా  ఆకారమే లేని వాడు అని వేదాలే చెప్తున్నా ఇప్పుడు ఈ ఆకారంతో ఉన్నవాడు ఈ దేవుడు ఆకారంతో ఉన్నవాడు ఆ దేవుడు అని చెప్పడంలో  అర్థం ఉన్నదా  వ్యక్తి పూజకు దానికి ఏమిటి   తేడా  నీవు ఏ ఆకారాన్ని మనసులో అనుకుంటావో ఆ ఆకారంపై నీ మనసును కేంద్రీకృతం చేసుకోవడానికి అది ఒక ఆయుధంగా పనికొస్తుంది తప్ప  నిశ్చలమైన నీ దృష్టిలో ఉంది  అని నిజమైన వేదాంతం చెప్పుకుంటూ  వస్తాడు  ఒక్కడే భగవంతుడు అయినప్పుడు ఎలాంటి విమర్శలు ఉండవు కానీ రకరకాల పేర్లతో ఉన్నటువంటి  నమ్మకాలను చూసినప్పుడు మాత్రమే  అనేక రకాలైన విమర్శలు రావడానికి అవకాశం ఉంటుంది  నిజంగా మనిషికి బుద్ధి రాలేదు కనుక  ఆ బుద్ధి కలవాని ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే  బుద్ధ భగవానుని గురించిన చరిత్ర తెలుసుకోవాలన్న ఆతృత మనలో ప్రారంభమవుతుంది.
ధర్మ రక్షణ కోసం శ్రీరామచంద్రమూర్తి  జీవన పయనం సాగింది  వాల్మీకి మహర్షి కానీ శ్రీరామచంద్రమూర్తి గారి భగవంతుడు రాముడు అన్న మాట ఎక్కడా వాడలేదు నేను ప్రత్యేకించి రామాయణం గురించి ప్రతి అక్షరానికి అర్థం చెప్పగలిగిన శ్రీ భాష్యం అప్పలాచార్యులు గారిని కలిసి ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాబట్టగలిగాను  వారు చెప్పింది అసలు రామాయణం ఏమిటి  గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలను తీసుకుని వాల్మీకి మహర్షి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సామాజిక న్యాయాన్ని ధర్మాన్ని చెప్పి ప్రతి ఒక్కరూ ధర్మపథంలో పయనించడానికి మార్గాన్ని చూయించాడు  ఆ 24 ధర్మాలను సాధించినవాడు శ్రీరామచంద్రమూర్తి కనుక ఆయనను మనం భగవంతుడు అని భావిస్తున్నాను తప్ప వారు కానీ వాల్మీకి మహర్షి గాని     భావించలేదు.ఈ విషయాన్ని గురించి నేను అధ్యయనం చేస్తున్న సమయంలో నాకు ఎదురైన మంచి వ్యక్తి  శివ నాగిరెడ్డి గారు  వారి మాటలు గాని చేష్టలు కానీ  ఆలోచనలుగానీ ఒకే రకంగా ఉంటాయి తప్ప మూడు విధాలుగా ఉండవు  కొంతమంది ఆలోచించేదొకటి చెప్పేది ఒకటి చివరకు చేసేది ఇంకొకటి ఒకదానికొకటి పొంతన ఉండదు  రెడ్డిగారు ఏది ఆలోచిస్తారో దానినే నమ్ముతారు ఆ నమ్మిన దానిని ఆచరిస్తాడు  తాను చదివిన ప్రతి కాకమ్మ కధను ఇది నిజమా వాస్తవమా అని ఎప్పుడూ నిర్ణయించుకోలేదు  తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నది శాసనముల ద్వారా మనకు కనిపించేది  మాత్రమే  మనకు ఆధారం అని నమ్మి  ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి గురుముఖతః  అనేక సంవత్సరాలు కష్టపడి బుద్ధుని యొక్క పుట్టుక వారి వైభవం వారి సిద్ధాంతం వారు పడిన కష్టం మొత్తం  ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ రోజున ఏది జరిగిందో చెప్పగలిగిన వ్యక్తి  వారు నమ్మిన దానిని  అక్షర రూపంలో మనకు అందించారు మన సొంత పైత్యం కాకుండా  దానికి ఎలాంటి విశేషణాలు జోడించకుండా  ఉన్నది ఉన్నట్టుగా యధాతథం గా  చెబితే చాలు  అసలు సత్యం బయటపడుతుంది అన్న నమ్మకంతో నేను ఈ బృహత్కార్యానికి  నడుము కట్టాను ఈ రచన పూర్తయిన తర్వాత మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తాను అప్పుడు మీరు  మీ అభిప్రాయాలను  నిర్భయంగా చెప్పవచ్చు.
సమన్వయం - డా.నీలం స్వాతి

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం