సోమన్నకు "తెలుగు బంధువు" బిరుదు ప్రదానం

 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్నను ప్రతిష్టాత్మక  "తెలుగు బంధువు" బిరుదు వరించింది. బాలసాహిత్యవేత్త సోమన్నను వారి విశేష తెలుగు సాహితీ కృషి గాను,అనతి కాలంలో 52 పుస్తకాలు వ్రాసి ముద్రించినందుకుగాను తెలుగు కవితా వైభవం( తెలుగు అభివృద్ధి సమితి )మరియు  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త  ఆధ్వర్యంలో,"తెలుగు కవితా వైభవం-దశాబ్ది ఉత్సవాలు" సందర్భంగా అధ్యక్షులు శ్రీ మేక రవీంద్ర గారు , హైదరాబాద్ వారిచే ,పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్  గారి చేతుల మీద ఈ అవార్డు రవీంద్ర భారతిలోఅందుకున్నారు. అనంతరం కవి గద్వాల సోమన్నను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో  విశిష్ట అతిథి డా.టి.గౌరి శంకర్ గారు, గౌరవ అతిథి డా.నాళేశ్వరం శంకరం గారు,డా.దాసోజు పద్మావతి గారు,విశ్రాంత రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సి.పి.రెడ్డి గారు, ఘంటారావం గంటా మనోహర్ రెడ్డి గారు, కవులు,ఉపాధ్యాయులు కళాకారులు,సాహితీమిత్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.  "తెలుగు బంధువు" అవార్డు గ్రహీత సోమన్నను  తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు