ప్రభుత్వ బడిలో చేరితే ప్రత్యేక బహుమతులు ;--రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య
ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ  ప్రభుత్వ ప్ర్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు ప్రత్యేక బహుమతులను తన సొంత ఖర్చులతో
అందజేస్తానని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు ప్రభుత్వ నుండి వచ్చిన ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులను అందజేశారు. పాఠశాల టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలకు స్వాగతం పలుకుతూ వారిని పాఠశాలలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆటపాటలతో కూడిన కృత్యాధార బోధనను అందిస్తున్నామన్నారు. సకల సౌకర్యాలతో పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసినట్లు ఆయన తెలిపారు. 2024 - 2025 విద్యా సంవత్సరంలో ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు ఉచితంగా తన సొంత ఖర్చులతో రాత పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు, చాక్మార్లు, బడి సంచులు ఇంకా ప్రత్యేకమైన బహుమతులు అందజేస్తానని ఈర్ల సమ్మయ్య తెలిపారు. చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాలు రామప్ప, వేయి స్తంభాల గుడి, లక్నవరం చెరువు సందర్శన చేయిస్తానని, పాఠశాలలో నవోదయ, స్పోకెన్ ఇంగ్లీష్, కాలిగ్రఫీ  (హ్యాండ్ రైటింగ్ నేర్పడం) లో ప్రత్యేక శిక్షణనిస్తామన్నారు. పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, తల్లిదండ్రులు త్వరపడి తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, పిల్లలు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు