ప్రభుత్వ పాఠశాలల ప్రగతిపై.. కొత్త పాట;- వెంకట్ ; మొలక ప్రతినిధి

 - ఇష్టం స్టూడియో యూట్యూబ్ ఛానల్ లో ఆవిష్కరణ
- అభినందించిన ప్రొఫెసర్ కోదండరాం
కొడంగల్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని రూపొందించిన కొత్త పాట తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ఆవిష్కృతమైంది.  శనివారం సాయంత్రం హైదరాబాదులోని కోదండరాం నివాసంలో కార్యక్రమం జరిగింది.  ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా ప్రగతి సౌకర్యాలు గురుకులాలు కేజీబీవీ మోడల్ స్కూల్ ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు సౌకర్యాలు విద్యా పథకాలు అంజిలప్ప రూపొందించిన పాటలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రగతి వీడియోలతో యూట్యూబ్ పాటలు స్టూడియో వారు రూపొందించారు. సంగీతం కృష్ణయ్య గానం తులసి పాడారు. అభినయం ఐశ్వర్య సుస్మిత చేశారు. నాలుగున్నర నిమిషాలు ఉండే ఈ పాటను కోదండరాం వీక్షించి అభినందించారు. పేద విద్యార్థులలో విద్యా ప్రగతిని సాధించి ఉన్నత శిఖరాలకు తీర్చిదిడిపిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంకితం చేస్తున్న ట్లు తెలిపారు.  ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల కళాశాల కార్యక్రమాలు వీడియోలు ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్,  ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ,  ఓయూ విద్యార్థి నాయకుడు రెడ్డి శ్రీనివాస్,  ఎం కృష్ణయ్య, నరేష్ కుమార్, అంజిలప్ప,  టీవీ రాష్ట్ర నాయకులు రతన్ రావు సందేశ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు