వింతలు విడ్డూరాలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 19వశతాబ్ది ప్రారంభం లో టెన్నిస్సీ ప్రాంతం లో బెల్ కుటుంబం నివసించేది.బెల్ విచ్ అనే ఘోస్ట్ ఆడగొంతుతో మాట్లాడేదిట.కానీ కంటికి కనిపించేదికాదు.జాన్ బెల్ ఇంటికి పొరుగున ఉన్న కేట్ బాట్స్ ప్రేతాత్మగా భావిస్తూ వచ్చారు.ఆవృద్ధకేట్ జాన్ ని అతని కూతురు బెట్సీ ని తెగ సతాయించాడు.జాన్ బెల్ ఆబాధ భరించలేక చనిపోయాడు. ఆప్రాంతం జనాలంతా కేట్ దుడుకుతనం గుర్తించారు.కానీ ఎవరూ సశాస్త్రీయంగా దాన్ని నిరూపించలేకపోయారు.కానీ ఒక సైకో ఎనలిస్ట్ ఇలా అన్నాడు " ఇదంతా బెల్ కూతురు బెట్సీ ఆడిన నాటకం అని కొట్టి పారేశాడు.ఆపిల్లకి ముసలి తండ్రి అంటే ద్వేషం అందుకే అలా ఘోస్ట్ అని నాటకం ఆడిందని తేల్చేశాడు.తండ్రి ముసలితనం రోగాలు రొచ్చులతో విసిగిపోయిన కూతురు తానే మాట్లాడుతూ తనపై పొరుగింటి కేట్ బాట్స్ ప్రేతాత్మగా ఆవహించింది అని అందర్నీ నమ్మించి నాటకమాడింది అని సైక్రియాటిస్టుల అభిప్రాయం.ఇప్పుడు గూడా మనం చూస్తున్నాంకదా  చేతబడి బాణామతి పేరు తో హత్య లు చేయడం.మానసిక ఒత్తిడి తో మనిషి పిచ్చాడిగా మారుతాడు .తన తప్పులు కప్పి పుచ్చుకోవడం కోసం రకరకాల పన్నాగాలు నేరారోపణలు చేస్తాడు🌹

కామెంట్‌లు