ప్రపంచ పర్యావరణ దినోత్సవం- సి.హెచ్.ప్రతాప్
 ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ద్వారా 1973లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ప్రారంభించబడ్డాయి. మన గ్రహాన్ని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేయడం మరియు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఇది ఒక ముఖ్యమైన సంఘటన.ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏటా 143 దేశాలకు పైగా భాగస్వామ్యంతో, ప్రజల కోసం ప్రపంచ వేదికగా మారింది. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన సంస్థలు, స్వచ్చంద సంస్థలు , కమ్యూనిటీలు, ప్రభుత్వాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ పర్యావరణ కారణాలను వాదించడానికి ఒక కొత్త థీమ్‌ను అందజేస్తుంది. ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు: చెట్లను నాటడం, స్థానిక బీచ్‌లను శుభ్రం చేయడం, సమావేశాలను నిర్వహించడం, ఆన్‌లైన్ నిరసనల్లో చేరడం. ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్  దృష్టి పెట్టడానికి ఒక నిర్దిష్ట సమస్యను ఎంచుకుంటుంది.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 యొక్క థీమ్ 'భూ పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత'. ఈ కార్యక్రమం యొక్క నినాదం "మా భూమి, మా భవిష్యత్తు. 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్‌లో భూమి పునరుద్ధరణ ఒక ముఖ్యమైన భాగం అయ్యింది.
భూమాతను పునరుజ్జీవింపజేయడానికి అవసరమైన వనరులు కొంచెమే చాలు. అయినప్పటికీ భూమాత మన అన్ని అవసరాలనూ ఎల్లప్పుడూ తీరుస్తూనే ఉంటుందని పదే పదే నిరూపితమైంది. అన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ మాటలు ఎంతో స్పూర్తిదాయకమైనవి.ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అటవీ సంపదను పెంపొందించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు, భారతదేశంలోని 26 రాష్ట్రాల్లో 81 కోట్ల 20లక్షల చెట్లను నాటింది. వీటికి తోడుగా దేశవ్యాప్తంగా కేవలం కాగితాలపై మాత్రమే ఉండి, వాస్తవంగా అంతరించిపోయిన 70 నదులకు జీవం పోసింది. నీటి సంరక్షణకోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ దేశవ్యాప్తంగా 19,000 గ్రామాలలో చేపట్టిన కార్యక్రమాలద్వారా దాదాపు మూడున్నర కోట్ల మందికి ప్రయోజనం చేకూరింది. పర్యావరణం అంటే మొక్కలు, చెట్లు, పర్వతాలే కాదు మనం కూడా పర్యావరణంలో భాగమే. మనం ఎలా ఆలోచిస్తామో అనేది కూడా పర్యావరణాన్ని మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పాజిటివ్ ఆలోచనలు చేయటం, మనమందరం సంతోషంగా ఉండేలా చూసుకోవడటం కూడా పర్యావరణం పరిరక్షణలో అంతర్భాగం.

కామెంట్‌లు