మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలుషి,నెల్లూరు.
ఆంగ్లేయులతో స్నేహముగా ఉన్న నవాబ్ సహోదరుడగు అబ్దుల్ వహాబ్ చంద్రగిరి నుంచి ఇంగ్లీషు వాడితో చేరి తిరుపతికి స్వల్ప సేనలు పంపి దేవస్థానము తన స్వాధీనం చేయమని అడిగాడు కానీ ఇంగ్లీష్ వారు  ఇదివరలో ఉన్న ఇజారా దారుకు ఇచ్చారు నారాయణ శాస్త్రి తిరుపతికి 15 మైళ్ళ దూరం లో ఉన్న కరకంబాడిలో కొంతకాలం ఉండి మట్లవారి సహాయము వలన సేనలో చేర్చుకొని ఇంగ్లీష్ సేనాని విల్కమ్ తనతోను ఇజారాదారుని సేనతోను యాత్రికులు వచ్చు కొండ మార్గము కాచు చుoడగా మారుత్రోవను కొండెక్కి దేవస్థానమును స్వాధీనం చేసుకున్నాడు  జూలై నెల తొమ్మిదో తేదీన దీని  కొండ నుండి మహారాష్ట్రులను కింద నుంచి మట్లవారిలో ముట్టడించారు కానీ వారు ఓడిపోయారు.దేవస్థానము ఇంకను వారి స్వాధీనంలోనే ఉన్నది తిరుగా మద్రాస్ నుంచి సేన ఫిరంగులు విల్కర్ సేనాని సహాయమునకు వచ్చెను  నాలుగు జాతుల హిందూ సిపాయిలు మాత్రం కొండ  ఎక్కడానికి అర్హులవడం వల్ల ఇంగ్లీషు వారి హిందూ సిపాయిలు నిజారాబాద్ సేనను కలిసి 500 మంది కొండ కు వచ్చి పోరాడారు కానీ చివరకు ఓడిపోయాడు  హైదరాబాదులో జరిగిన సంగతుల వలన సుబేదారు సహోదరుడైన భసౌలత్ జంగ్ పద భ్రష్టు 
డే కొంతసేనతో దేశము  దోచుకొనుచు నెల్లూరు ప్రాంతం వరకు వచ్చేసాడు దక్కన్ శుభా వల్ల వసూలు చేయుటకు పంపబడినవి చెబుతూ నజీబుల్లా ఖాన్ ఇంకనూ అనేక పాలే గార్లకును బాకీ ఉండు కప్పo చెల్లించవలసినదిగా బెదిరిస్తూ జాబులు రాశాడు.ఆర్కాడ్ లో ఫ్రెంచ్ వాడితో కలియుటకు వీర్ల రాజ్యముల గుండా తాను కోవలెనని వెల్లడించ వీరందరూ మరింత భయం కనoపితులయ్యారు నజీబుల్లాఖాన్ పాలెగాండ్లందరును మద్రాస్ లోని ఇంగ్లీషువారు సహాయం కోరినను తిరుపతి కొండ  స్వాధీనం చేసుకొనుటకు ఇంగ్లీష్ వారి కొరకు అయినను సహాయం చేయలేకపోయారు  హిజ్రా దార్ ఓడిపోయినాడు అని విని  పాలేగార్లు మొదలగు వారికి భయము మరింత ఇచ్చింది నారాయణ శాస్త్రి కి సహాయముగా సేన వచ్చుచున్నదనియు అది తిరుపతి ఆక్రమించిన అంతట వచ్చే ఉత్సవం నుంచి మేజర్ కాలియడ్ అన్న సేనాని సైన్యములోనూ మందు గుండు సామానుతోను తిరుపతికి వచ్చి కరకంబాడి పాలేగాళ్ళతో పోరాడి ఓడించి గ్రామమును చుట్టుపట్ల  ఉన్న ప్రాంతాలను ధ్వంసం చేసి పాలేగాల్లను చంపాడు.

 

కామెంట్‌లు