యు.ఎఫ్.ఓ! అచ్యుతుని రాజ్యశ్రీ
 అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ పై పరిశోధన 1947 లో ప్రారంభం ఐంది. కెనెత్ ఆర్నాల్డ్  అనే పైలెట్ ఈడిస్క్ లాంటి ఎగిరే పళ్లాలు చూశాడు. గంట కి 1930 కి.మీ.వేగంతో గొలుసు లాగా తిరగటం చూశాడు!7 అడుగులున్న ప్రాణులు పారదర్శకంగా ఉన్న దుస్తులు తో 3 అడుగులు వెడల్పున్న మరుగుజ్జులు వాటిల్లో నుంచి దిగారు అని జనాల పుకార్లు షికార్లు కొట్టాయి.  ప్రాజెక్ట్ బ్లూబుక్ అనే పేరు తో యు.ఎస్.ఏర్ఫోర్స్ తో కొంత మంది పరిశోధకులు 20 ఏళ్ళు రిసెర్చ్ చేశారు. డాక్టర్ ఎలెన్ హైనక్ పరిశోధన లో అసంతృప్తి వెలిబుచ్చాడు.
స్విస్ రచయిత ఎరిక్ తన గ్రంథం లో " ఛారియట్స్ ఆఫ్ ది గాడ్స్" లో ఏంరాశాడంటే పిరమిడ్ ఇంకా సుమేరియన్లు ఈ గ్రహాంతరవాసుల సాయంతో ఎన్నో కట్టడాలు నిర్మించారు . కెనెత్ ఆర్నాల్డ్ వాటికి ఫ్లయింగ్ సాసర్స్ అని పేరు పెట్టాడు. 9 డిస్క్ ఆకారాలు వరుసగా గొలుసు లాగా ఎగరడం చూశాడు 🌹

కామెంట్‌లు