సైనికున్నీ!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
నేను భగత్ సింగ్ ను సుభాష్ చంద్రబోస్ ను కాలేకపోవచ్చు. కానీ
నేను  ఒక రైతును ఒక సైనికున్నీ!!!

నేను శివాజీని మహారాణా ప్రతాప్ ను కాలేకపోవచ్చు. కానీ
నేను ఒక రైతును ఒక సైనికున్నీ!!!!

నేను కల్పనా చావ్లా సునీత విలియమ్స్ కాలేకపోవచ్చు. కానీ
నేను ఒక రైతును ఒక సైనికున్నీ!!!!

నేను ఝాన్సీ లక్ష్మీబాయిని రజియా సుల్తానాను కాలేకపోవచ్చు. కానీ
నేను ఒక రైతును ఒక సైనికున్నీ!!!!!

నేను మహాత్మాను మదర్ థెరీసా ను కాలేకపోవచ్చు. కానీ 
నేను ఒక రైతును ఒక సైనికున్నీ!!!!

నేను ఒక నరేంద్రుని ఒక ఇందిరాను కాలేకపోవచ్చు. కానీ
నా హద్దుల్లో నేనున్నా
ఒక రైతును ఒక సైనికున్నీ!!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు