మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి, నెల్లూరు.
 గంటా మండపం శ్రీవారి నైవేద్యం పెట్టినప్పుడు ఆలయంలో గంట వాయిస్తారు దాని శబ్దం తిరుమల అంతా వినిపిస్తోంది ఆ తరంగాలు తగలగానే తనంతట తానే మోగే గ ఒక గంట తిరుమల లో ఎనిమిదో మైలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉండేది ఆ మండపాన్ని గంట మండపం అంటారు ఆ మండపంలో గంట మోగ గానే చంద్రగిరి దుర్గం లో ఏర్పాటు చేసిన గంట కూడా మోగుతుందట  ఆ గంట శబ్దం అవ గానే రాజుగారు భోజనానికి సిద్ధపడతారట అంటే శ్రీవారికి నైవేద్యం సమర్పించాకనే రాజుగారు భోజనం చేస్తారు  అంతటి భక్తుడు ఈ తిరుమల రాయల వాడనని ఈ రచయిత అభిప్రాయం  ప్రౌఢకవి అన్నిశెట్టి లక్ష్మయ్య గారు చంద్రగిరి దుర్గా అనే పద్య కావ్యం రాశారు అందు  నవమఖండములో ఈ విషయం మనకు కనిపిస్తుంది.
రామదేవు బంగారు జయగంట  అంటారు ఈ రామదేవుడే తిరుమల దేవరాయలేమో తెలియదు ఈ జయ గంట ను ఆయనకు బహుకరించిన వాడు వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు సంపాదించాడేమో తెలియదు 1740 సంవత్సరంలో ఈ ప్రాంతం మీద మహారాష్ట్రయోధులు వచ్చి దోపిడీలు చేశాడు తిరిగిపోయేటప్పుడు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించి ఆయనకు 40 రకాల నగలు ఒక పెట్టిలో పెట్టి బహుకరించినారు ఇప్పుడు శ్రీవారి కి ఉన్న ప్రాచీనమైన నగలు అవే పురాతన కాలంనాటి నగలు సాలువ నరసింహారాయల కాలంలో ఒకసారి దొంగతనం జరిగి అదృశ్యమైనవి శ్రీకృష్ణదేవరాయలు బహుకరించిన నగలు ఆయన కలలోనే అపహరించబడ్డాయి ఏవో ఒకటి రెండు  మిగిలిన  1930 నాటికి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శాసన నివేదిక తయారు చేశారు ఆయన వల్ల ఇందులో వ్రాసిన చాలా విషయాలు ప్రామాణికమైనవి కావు అన్న సంగతి గ్రహించాలి.వీరు మిగల భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతిదినము రేయింబగళ్లు నివేదన కాలములో పెద్ద గంటలు వాయిస్తారు అని  దానిలాగా మూడు మైళ్లు వినపడుతుంది దేవస్థానానికి మూడు మైళ్ళ దూరంలో ఒక మండపం గంటా ఉన్నాయి. వీరు కట్టించినవే అవి దేవస్థానంలో నివేదన గంట కాగానే ఈ గంట వాయించబడుచున్నను ఈ నినాదం చంద్రగిరి కోటకు చేరగా అచ్చట దేవత నివేదనై తాము పూజించెదరు అని చెప్తారు వీరి పుత్రులలో ఒకరు  శ్రీహత్తి రాంజీ వారికి శిష్యుడై శ్రీ మహంతు గిరిధర దాస్ జి నామమున శ్రీహ తీరాoజి మటములకు మూలపురుషుని తర్వాత మహంతు గా ఉన్నాడు.


కామెంట్‌లు