స్ఫూర్తి దాతలు 3_ అచ్యుతుని రాజ్యశ్రీ
 కేవలం చదువు డిగ్రీ కాదు.స్వయంకృషితో ఆలోచన తో తాను నడుస్తూ ఇతరులకు మార్గదర్శకులు కావాలి. గుడిసెలో ఉండే దుర్గా దేవి అనే బాలిక కరెంటు లేకున్నా గవర్నమెంట్ స్కూల్ లో చదివి టెన్త్ క్లాసు లో బడిలో ఫస్ట్  జిల్లా లో రెండోస్థానంలో నిల్చింది.తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచితంగా కరెంటు ఇవ్వడం ముదావహం
ఝార్ఖండ్ కి చెందిన శకుంతల  అమ్మ నాన్న కు 7గురుపిల్లలు.బడి బాల్యంలోనే దూరం 19 ఏళ్ళకే పెళ్లి. ఊళ్ళో ని ఆడవారి తో సంఘంగా ఏర్పడి శిక్షణ తీసుకుని రాగిపిండితో లడ్డు బిస్కెట్లు లాంటివి తయారు చేసి   వ్యాపారం లో రాణిస్తోంది.చదువు లేకున్నా తన సత్తా చాటుతోంది.
మనం కొబ్బరి ఆకులతో బొమ్మ లు చేస్తాంసరదాగా. కానీ ఉత్తరాఖండ్ కి చెందిన నుపుర్  వెటర్నరీ డిగ్రీ పొందింది. తండ్రి పశువుల డాక్టర్. ఖేతిఖాన్ అనే పల్లెలో ఆడవాళ్ళు వ్యవసాయం చేస్తారు. పంటలు సరిగ్గా పండవు.పైన్ చెట్లు వల్ల  అడవిలో అగ్గి రాజుకోటం చూసి నుపుర్ ఆరాలిన పైన్ ఆకుల్తో బుట్ట టోపి గిన్నెలు చేసి ఆడవారికి నేర్పింది. నగలు కూడా తయారు చేసి అక్కడి మహిళలకు ఉపాధి కల్పించడం ముదావహం. ఎగ్జిబిషన్ల ద్వారా మంచి ప్రచారం లోకి పైన్ చెట్ల ఆకులతో ఉపయోగం తెల్పింది. బెస్ట్ ఔటాఫ్ వేస్ట్ అంటే ఇదే కదూ🌹

కామెంట్‌లు