ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వామపక్షపాతిగా మార్క్స్ను యాంగిల్స్ లెనిన్ ను ఏమైనా అన్నా భరించేవాడు  కానీ  హనుమంతుని హృదయం చీల్చితే సీతారామ లక్ష్మణులు ఎలా ఉంటారో నా గుండె చీలిస్తే శ్రీరావి శ్రీ కాళీపట్నం రామారావు అలా ఉంటారని చెప్పుకునేవారు ఒకరోజు అనుకోకుండా రావిశాస్త్రి గారు వీరి ఆఫీసుకు రావడం జరిగింది ఆయన్ని బాగా గౌరవించాలని సత్కరించాలని క్రిందకు దిగివస్తే తీరా రాజుగారు మీకోసం కాదు మీ ప్రక్కన ఉన్న సివి కోసం వచ్చాను అంటే నిర్ఘాంత పోయారు కృష్ణoరాజు గారు ఐదు నిమిషాల్లో శాస్త్రి గారి పని పూర్తి చేసి రాజు గారి దగ్గరకు వచ్చిన సివిని అప్పుడు అపురూప వ్యక్తిగా చూశారు అలాంటి అద్భుతాలు ఆయన జీవితంలో ఎన్నో జరిగాయి.ఎన్టీ రామారావు గారి లీలలను గురించి బాగా మాట్లాడగలిగిన వ్యక్తి పాత్రికేయుడు ఏచూరి గారు  నటుడు మంచి వక్త రామారావు గారికి స్నేహితుడు ఎన్టీఆర్ గురించి ఒకరోజు ఏచూరి గారు చెప్తున్నాడు అంతా ఆయనను పిసినారి అనుకుంటారు పలా నా సంవత్సరంలో సందర్భంలో నాకు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అని మధ్యలో రావు గోపాల్ రావు గారు కల్పించుకొని ఏం బాబు గారు సివి చిరునవ్వులు వలకబోస్తున్నారు ఏవైనా పేలుస్టారా ఏమిటి ముందు చెప్పండి మా పొట్టని చేత పట్టుకుంటాం అని అన్నారు అలా  అనకండి  మీరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు  ఒక పని చేద్దాం మీరు చెప్పిన దాన్ని విని మేము నవ్వితే మీకు వంద రూపాయలు ఇస్తాను నవ్వకపోతే మీరేం చెల్లించనవసరం లేదు అంటే అవును మరి తమరు దొరలు కదా మీకు డబ్బు మీదే ధ్యాస తీరా నేను చెప్పిన తర్వాత నవ్వు వచ్చిన 100 రూపాయలు ఇవ్వవలసి వస్తుందని మీరు నవ్వలేదనుకోండి నాకు నష్టమే కదా అన్నారు సివి  అలా అనకండి కాంగ్రెస్ పార్టీ వారు మేం తెలుగుదేశం వాళ్ళ మైనా మాకు నిజాయితీ ఉంది అన్న తర్వాతే సరే చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టారు.అవి ఎన్టీ రామారావు గారు దానవీరశూరకర్ణ సినిమా తీస్తున్న రోజులు అన్ని వేషాలు ఆయన చేస్తున్నారు ప్రతిరోజు ఆయనకే అసోసియేట్ విషయం చెప్పాలి. అప్పుడు ఆయన మేకప్ చేసుకుంటారు ఒకరోజు అసోసియేట్ వచ్చి సార్ ఇవాళ కర్ణుడు వేషం అన్నాడు సందర్భం చెప్పండి అన్నారు ఎన్టీ రామారావు ఇంద్రుడు వచ్చి కవచకొండలాలు అడిగితే మీరు దానం చేయాలి సార్ అన్నాడు ఏమిటి మళ్ళీ చెప్పండి అని రెట్టించారు ఆయన మళ్లీ అదే చెప్పారు ఇదేమీ మేము దానం చేయాలా ఈ షాట్ డూప్ తో చేయించండి మేం ధర్మం చేయడమేమిటి అని తీక్షణoగా చెప్పి వెళ్లిపోయారు అంటే పాత్రలో కూడా ధర్మం చేయడు అన్నమాట రాంగోపాల్ రావే కాక మిగిలిన వాళ్ళు కూడా తలా వంద ఇచ్చారు ఆ డబ్బులతో స్వీట్స్ హాట్స్ అందరికీ ఏర్పాటు చేశారు  అలా ఉంటుంది ఆయన పనితీరు
============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం