ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 చివరకు మిగిలేది రచయిత బుచ్చిబాబు గారు  ఆమంచర్ల గోపాల్ రావు గారు ఏడద కామేశ్వర్ రావు గారు జీవి కృష్ణారావు గారు యండమూరి సత్యనారాయణ గారు లత గారి లాంటి అందరి పొగడ్తలు అందుకోవడం నా అదృష్టం  హాస్యం అనేక రకాలుగా పుడుతూ ఉంటుంది దాంతో నవ్వులు విరజిమ్ముతాయి ఆ నవ్వుల్ని ఆరు రకాలుగా అభివర్ణించారు ఆ వివరాలు నేను రేడియోలో వచ్చేటటువంటి కొద్ది కాలానికి హైదరాబాద్ నుంచి బ్రహ్మశ్రీ పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు గారు విజయవాడ వచ్చారు ఆ తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమంలో చక్కని వేదాంత విషయాలను చెప్పిన వారు చాలా మందికి తెలుసు అంతకుముందు నేను నాగరత్నమ్మ వీబి కనకదుర్గ చేస్తున్న పసిడి పంటలు కార్యక్రమంలో వ్యవసాయ విషయాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారు ఉషశ్రీ గారు.కానీ అనౌన్స్ గా సరిగా ఆయన ఎవరికీ తెలియదు అని చెప్పాలి దానికి కారణం ఆయన ఒకే ఒకసారి విషాద ఘటన ప్రకటించారు నేను డ్యూటీలో ఉన్నాను 1964 సంవత్సరంలో మధ్యాహ్నం జరిగిన ఘోరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి అస్తమయం మాకు యండమూరి సత్యనారాయణ గారు శ్రీ సత్య  శ్రీవత్సవ ఆయన కలం పేర్లు ఆయన చాలా ఖచ్చితమైన మనిషి ప్రతిదీ పద్ధతి ప్రకారం నియమ నియామకాలను అమలుపరిచేవారు ఆయన ఉషశ్రీ గారికి అనౌన్స్మెంట్ ఇచ్చి నాతో రిహార్సల్స్ చేయించి ప్రసారం చేయించుకోమని పంపించారు నాకు అంతకు ముందు శ్రీవత్సవ గారు చెప్పిన మంత్రం ఆనందంగా హుందాగా సున్నితం గా ఎనౌన్స్మెంట్ ఉండాలి అని చెప్పారు ఆ పద్ధతిలోనే ఉషశ్రీ గారికి వినిపించాను   అప్పుడు ఆయన నాయనా ఇది విషాదవార్త అందులోనూ దేశ ప్రథమ ప్రధాని ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చెప్తే వ్యతిరేక భావం వస్తుందని వేడర్ ఓపెన్ చేసి ఆయన చెప్పేశారు ఆ వార్త.అలా  గురువుగారు అనౌన్స్ సార్ అవుతారo కూడా ఎత్తారు ఈ సంఘటన తలచుకుంటే ఇప్పటికి నాకు నవ్వు పుట్టుకొస్తూనే ఉంటుంది నెహ్రూ గారి కుటుంబ సభ్యుల్ని సన్నిహితంగా కరచాలనం తో కలుసుకోవడం ఎవరికి ఆనందం పుట్టించదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానిగా ఉన్న సమయంలో గుంటూరులో కాంగ్రెస్ మహాసభలు జరిగినాయి అప్పుడు ఇందిరాగాంధీ గారు సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు గుంటూరులో సభ ముగిసిన తర్వాత ఇందిరాగాంధీ రేడియోకు వచ్చి కళాకారులను కలిసి మాట్లాడి వెళ్ళడానికి వస్తారని కలెక్టర్ గారు మా డైరెక్టర్ గారికి వర్తమానం అందించారు మనతో మాట్లాడడానికి వస్తున్నారు ఐదు గంటలకు రావాల్సి ఉంది  మమ్మల్ని శ్రీవత్సవ గారు ఒక వలయా కారo లో నిలబెట్టి ఇందిరాగాంధీ గారి కొరకు కుర్చీ ఖాళీ ఉంచి ఎదురుగా స్టేషన్ డైరెక్టర్కు వేసి ఆ వెనక అధికార సిబ్బంది  సాయంత్రం ఐదు గంటలు అయిందిఆమె రాలేదు.
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు