ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సివి గారి పద్ధతులు కొన్ని విచిత్రంగా ఉంటాయి ఎవరైనా తప్పు చేసినప్పుడు తిడతాం  అపకారం చేసినప్పుడు  శపిస్తాం మంచి చేసిన వాళ్ళని కీర్తిస్తాము ఉపకారం చేసిన వాడికి బహుమతులు లాంటివి కృతజ్ఞతలు చెప్పుకుంటాం  అదే భగవంతుడు అయితే వరాలిస్తాడు అంటారు ఈయన పద్ధతి వ్యతిరేకంగా ఉంటుంది సాయంకాలం నిత్యం మేము కాఫీ తీసుకునే షాపులో ఆ ఓనర్ లేడు వేరే షాప్ కి వెళితే అదే రసం అదే కొలత ధర మాత్రం రెండింతలు  నేనైతే తిట్టేవాడిని లేకపోతే విసుక్కునేవాడిని కానీ సివి గారు నీవు ధనవంతుడు వి ఆవుదువు గాక అని దీవించారు  ఏం సార్ అంటే అవునండి  ఇతను ఎంత ఇబ్బడిగా సంపాదిస్తే కదా కోటీశ్వరుడు కావడం అప్పుడు కదా విపరీతమైన  దృష్ట్యాలు చేయడం ఆ పరమాత్మ చూసుకుంటాడు మనకెందుకు అనేవారు.మరి నీతిమంతుడి విషయం బీదవాడిని పేదవాడి గానే ఉండమంటున్నారు  వాడికి లక్ష్మీ కటాక్షం అవసరం లేదా అంటే అతని యొక్క లక్ష్మి కటాక్షం వేరే ఎవరి కొంటుందండీ పిల్లలతో హాయిగా కులాసాగా కలిసి పనిచేసి సంపాదించి కలిసి అనుభవించే స్థితిని మించి దేనిని కోరుకుంటున్నారు మీరు డాలర్ల సంపాదన కోసం రక్తసంబంధాన్ని పరదేశాలకు పంపితె ఆత్మీయులు అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని స్థితినా  డబ్బు సంపాదిస్తూ వృద్ధాశ్రమాలకు తల్లిదండ్రులని విరాళంగా పంపే సంతానాన్ని చివరి క్షణాల్లో ఆప్యాయంగా నాలుగు మాటలు చెప్పలేని సంపాదన ఎంత ఉంటే ఎవడికి కావాలండి ఎవరు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం తీసుకుని వెళ్తారు? రాముడు 9 అంతస్థుల భవనం కడితే రావణబ్రహ్మ 11 అంతస్తులు కట్టాడు.ఆర్థికంగా విపరీతంగా సంపాదించాడు ఎంత కాలం నిలిచింది ఆ వైభోగం  శాశ్వతత్వాన్ని కోరుకోవాలి ఇదంతా నా చాదస్తం పట్టించుకోకండి అని తప్పుకుంటారు  వారిలో ఎవరిని చూడాలి మామూలు  సివినా తాత్విక మూర్తిన  మేధకు జ్ఞాపకశక్తి తోడైతే మంచి విమర్శకుడు అవుతాడు తులనాత్మక   విమర్శన ఎప్పుడు తన సొంతమవుతుందో అతను మంచి పేరు ప్రఖ్యాతుడు ఆ లక్షణాలు మన రత్న బోస్ లో కనిపిస్తాయి  1970 నుంచి ఆడిషన్ ఎక్కడ నాటకాలు వేస్తూ తన సొంత సంస్థ నుంచి ఇచ్చిన నాటకాలు ఎక్కువ  కదంబ కార్యక్రమం అంటే  సంగీత కార్యక్రమాలలో నాటకాలలో రాసి వాసి పరంగా ఆయనవే ఎక్కువ  సంగీత కదంబం అంటే ఒక శాస్త్రీయ గీతం లలిత గీతం లలిత శాస్త్రీయం జానపదం లాంటి ప్రక్రియలన్నీ కలిపి అరగంటలో పూర్తి చేయడం.
=====================
సమన్వయం ; డా. నీలం స్వాతి 



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం