ఆకాశవాణి విజయవాడ కేంద్రం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 శ్రోతరకు విసుగు లేకుండా కార్యక్రమాన్ని వేగంగా నడపాలి అందరూ సిద్ధహస్తులు రత్న బోస్  ఆయన ఆస్థాన కవి రచయిత వేదాంతం శరత్ చంద్రబాబు ఏనాటిక కావాలన్నా ఏ సంగీత రూపకం ప్రదర్శించారన్న తను ఆఖరి క్షణంలోనైనా అందించగలడు ఎక్కువగా కార్మికుల కార్యక్రమాలలో ప్రస్తుతం ఉన్న యువవాణి ఆ రోజుల్లో యువ భారతి పేరుతో ప్రసారమవుతుండేవి ఈ రెంటిలోనూ ఎక్కువ భాగం బోస్ సమర్పణలోనే ఉండేవి ఈయన నాటకాలు వేస్తున్నంతకాలం శ్రీరామ్మోహన్ రావు గారు కథానాయకుని పాత్ర ఇచ్చేవారు కాదు ఎక్కువగా హాస్య పాత్రలు క్యారెక్టర్ వేశారు ఒకసారి కారణం అడిగితే నీవు ఆనంద్ ను అనుపరిస్తున్నావు ఆ నాటకం మొత్తం వింటే ఆనంద్ కనిపిస్తాడు బోస్ కనిపించడు అంతే తప్ప నీ మీద వేరే అభిప్రాయం లేదు అని చెప్పాడు రామ్మోహన్ రావు గారు  నేను ఆయనను అనుకరించడం లేదు నా కంఠమే అలాంటిది   స్వతహసిద్ధంగా మా రెండు కలిసిపోయిన స్వరాలు అని చెప్పినా వినిపించుకోలేదు.హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయలు నాటకం ప్రదర్శించారు అందులో తను రాయల వేషo వేశారు తుర్లపాటి రామచంద్ర రావు గారు తిమ్మరసు పాత్ర  పోషించారు  నాటకం మొత్తం అయిన తర్వాత స్నేహితులంతా ఎస్వీ రంగారావు గారిని మరిపించారు అని అభినందించారు  విగ్రహాల రామారావు అని గుంటూరు ఆర్టీసీలో పనిచేస్తూ ఉండేవాడు  అక్కడి కార్మికులతో కదంబ కార్యక్రమాలను సమర్పిస్తూ ఉండేవాడు యంత్రాలతో కూడా  మంత్రం వేసి నాటక సంభాషణలను చెప్పించడంలో దిట్ట  నాటకాలలో కూడా బోసును నటింప చేసేవాడు  అతనిని రాముడు అని పిలుచుకుంటాం  రాముడు రంగస్థలం నాటకాలలో  ఆరితేరిన వాడు  తను నటిస్తూ దర్శకత్వ బాధ్యతను వహించి మంచి నటులను తయారు చేశాడు.తనకు ఆచార్య ఆత్రేయ గారితో చదువుతో వారు రచించిన అశోకుడు నాటకం హక్కులను తీసుకొని రంగస్థలం పైన నటించడమే కాకుండా ఆకాశవాణిలో కూడా ప్రదర్శించడానికి అనుమతి పొందాడు  ఆనాటకాన్ని రేడియోలో నేను నిర్వహించాను బోస్ తో పాటు  ఎన్ వి ఎస్ వర్మ టి నరసరాజు కూడా నటించాడు  వర్మ గారు పోస్ట్ ఆఫీస్ లో  పోస్ట్మాస్టర్ గా ఉద్యోగం చేసేవాడు అటు రంగస్థలం మీద నటిస్తూ హీరో కృష్ణ ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు కూడా చేశాడు  నరసరాజు ఆర్టీసీలో పని చేస్తూ రాముడు దగ్గర  నాటకాలు వేస్తూ సొంతంగా కొంతమందిని సమీకరించుకొని అనేక నాటకాలు ప్రదర్శించాడు కూడా  కొంతమంది కధా నాయికలను రంగస్థల  ప్రవేశం చేయించాడు.
==========================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు