ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఒక ప్రఖ్యాత కవి పేరు అనవసరం  సివి కి మహా ఇష్టం ప్రతి వాక్యం గుండెలకు హత్తుకోనేలా అనుభూతిని కలిగించే కవిగా ఆరాధిస్తూ ఒకరోజు ఆయనను చూడాలని బయలుదేరారు మధ్యలో ఆయనగారి లేఖకుడు రాస్తూ ఉంటాడు ఇతనికి నిర్మాతలే డబ్బులు ఇస్తారు కూడా,
తగిలి మాటల్లో పడ్డాడు కవిగారి ప్రస్తావన వచ్చింది ఆయనకు ఆలోచన రావాలి చెప్పాలన్న దృష్టి కలగాలి దానికి అపరాత్రి అర్ధరాత్రి లేదు ఈ కుర్రోడు అలానే నిరీక్షిస్తూ కూర్చోవాల్సిందే  సివి అనుమానం మరి ఆయన భోజనం చేయరా అనే ఆలోచన ఎలా అని ఎందుకు తినడు దున్నపోతులా తింటాడు అన్ని రకాలతో పాటు  పాలు పండ్లు కూడా మరి మీరు సివి అమాయక ప్రశ్న అలా చూస్తూ కూర్చోవలసింది తాను తినే అరటిపండు అయినా మీకు ఇవ్వరా అంటే పండు కాదు పండు పైన తొక్క కూడా ఇవ్వడు అనేసరికి తన అభిప్రాయాన్ని మార్చుకొని మానవత్వం లేని అలాంటి వాళ్ళను అభిమానించడం చూడాలని అనుకోటo క్షమించరాని నేరం   అంటారాయన.సిద్ధాంతాల గురించి జీవితాల గురించి మాట్లాడేవాళ్ళు అంటే ఆయనకు ఒళ్ళు మంట  ఒక చిన్న దుకాణం దగ్గర ఓ ముసలమ్మ వేసే అట్లు ఇడ్లీ, తెగతినేస్తూ ఆకలితో అలమటించే ఆకలి చూపులు వృద్ధుల్ని బాలల్ని పట్టించుకోని వాళ్ళ మాటల మీద తనకు నమ్మకం లేదు మాటల్లో చైనా రష్యాల వైభవాలు చెప్పుకుంటూ వెళ్లే తన మిత్రులకు ఆయన ప్రశ్న ఇదే ఇతర దేశాల జోలి నీకెందుకు ముందు నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటున్నావా? ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఒక వావిలాల గోపాలకృష్ణయ్య ఒక కామరాజును ఆదర్శం గా తీసుకోని నీవు ప్రపంచ దేశాల గురించి మాట్లాడే అర్హత కోల్పోయావు అంటాడు అందుకే చాలా మందికి దూరంగా ఉంటాడాయన ఇలాoటి వాళ్ళ మీద కోపం రాదు అయ్యో పాపం అన్న జాలి తప్ప వాళ్ళు కూడా సీవీ ఉద్వేగ భరిత మాటలకు కోపం తెచ్చుకోరు అయినా ఆ మాటలని పాటించరు  ఇదే భారత దేశ దౌర్భాగ్యం.మద్రాసులో ఎప్పుడూ రావుగోపాల్ రావు గారితోనే ఉంటాడు రావు గారికి ఈయన లేకపోతే నిద్ర రాదు. అందుకే ఆయన తీసే చిత్రాలు అన్నిటికీ ఈయనే రావాలి ఆయన అనుమతి లేకుండా ఏ పని జరగడానికి వీల్లేదు రచనలో ఒక మాట మార్చడానికి కానీ నటీనటుల వాళ్ళ పద్ధతిలో వెళ్లడం కానీ జరగదు వీరంతా ఖాళీగా విశ్రాంతిగా ఉన్నప్పుడు అన్నగారు ఎన్టీరామారావు గురించి ఆలోచించుకుంటూ ఉంటారు మద్రాసులో అంతా వారి గురించి తర్కించని వారు అరుదు ఎన్టీఆర్ పిసినారి అని ఎవరికి ఆర్థికంగా సహకరించరని    అపవాదు ఉంది  రామారావు గారికి కొన్ని నిర్దృష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి చేపలు కూర చేసి పెట్టడం కాదు చేపలను పట్టే విద్యను నేర్పు అనే తత్వం.
==============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు