అందరం కలిసి మెలిసి జీవిద్దాం;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
కాసింత పనిపాటచూపండి
రెక్కాడితే కానీ
డొక్కాడని మాపై
కాసింత దయజూపండి

కాళ్ళు రెక్కలే మా
ఆస్తిపాస్తులు
మీరు చెప్పిన పనిచేస్తం
కష్టానికి తగ్గ ప్రతిఫలం
ఇవ్వండి

మేము స్వార్థపరులంకాము
మేము బడుగు జీవులం
మేము ఎనకేసేదేమిలేదు
మా యింటిల్లిపాది పనిచేస్తే తప్పా
మాకు రోజు గడవదు

మా పిల్లలు వయస్సు మీరినా
సరియైన ఆహారం లేకే
బక్కచిక్కిపీనుగులెక్కున్న
తనువులు మావి

మాకు ఆత్మగౌరవం ఉంది
శ్రమనే నమ్ముకున్నోళ్ళం
పాడుకాలందాపురిస్తే
కాలాన్ని తిట్టిపోస్తాంతప్పా
ఈ మా దీనస్థితికి కారకుడైనోన్ని
ఎదిరించలేకున్నాం

వస్తువులను ప్రేమించుమనుషులున్న
పెట్టుబడిదారులమధ్య
ఆప్యాయతలు అనురాగాలు
అనే పదాలను ఇప్పుడు 
డిక్షనరీలో వెతికినా
అర్థవివణబాగానే ఉంది
కానీ
ఆచరణ చేయువారేలేరు

చావు పుట్టుక సహజమైవని
తెలిసినా
ధనికులు పేదలు మధ్యతరగతి
వారు అనే విభజనరేఖలెందుకు?!

సాటి మనుషులపట్ల
ప్రేమ ,దయా ,జాలి, కరుణ 
కల్గియుందాం
వెంటరాని ఈ ధనంపై
వ్యామోహం వదులుకుందాం
వెంటనడిచే
నలుగురిని సంపాదించుకుందాం
పదుగురి తలలో నాలుకలా
ఉందాం


కామెంట్‌లు