వివిధ;- అంకాల సోమయ్య దేవరుప్పులజనగాం9640748497
 ఏ భావన లేకుండా
కవితెలా పుడుతుంది
ఏ యాతన లేకుండా ఫలితమేలా దక్కుతుంది
ఏ బాధ్యత లేకుండా
భవిత ఎలా నిలుస్తుంది
ఆచరణ ఉంటేనే అనుకున్నది
జరిగేది
*"*
వనిత నై పుట్టానని విలపించకు
పునీతలాగే ఉండాలని
పురుషాంకారానికి తలవంచకు
సంధ్యలాగ జీవితాన్ని సగంలోనే త్రుంచకు
మహోజ్వలిత రూపమెత్తి మృగాళ్ల ను దునుమాడు
మహోన్నత ఆశయాలు సాధనతో ప్రజ్వరిల్లు

కామెంట్‌లు