బతుకు ప్రయాణం కంటే ఏదీ బరువు కాదు
ప్రాణం ముఖ్యాతిముఖ్య జీవన ధాతువు మనిషీ
జాగరుకులై కాపాడుకుంటేనే మాటాముచ్చట
అందుకే
ఖరీదైనా తప్పదు మోయక భారం
తలకెత్తుకున్నాను బతుకు భారాన్ని
కుంపటిలా కాదు వైద్యచికిత్స సలహా సంపుటిలా
ఇక ఇప్పుడు
మధ్యతరగతి మందహాసం మేఘావృతమైన ఆకాశం
కొడిగట్టిన దీపం ననుగన్న మట్టి ఆరోగ్యస్థితి
ఏదేమైనా బతుకు బండి ఆరోగ్యం కబళించే
వైరస్ ల కోరల దెబ్బలు,సూక్ష్మ క్రిముల గాయాల
నెదిరించే యజ్ఞంలో చికిత్సించు శక్తులు
దివ్య హస్తనేత్రాలైన వైద్యులు
ఎంతో విలువైనది ప్రాణం వెలకట్టలేనిది కూడా
వైద్యం మానవీయ కావ్యం
వైద్య సేద్యం సంజీవిని పంచే జీవనక్షేత్రం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి