తెలుగే వెలుగు* (గేయం );- ప్రభాకర్ రావు గుండవరం ( : మిత్రాజీ )ఫోన్ నం. 9949267638
తెలుగే వెలుగు 
వెలుగే తెలుగు
తెలుగే రాయీ
తెలుగే చదువూ  !! తెలుగే!!

జిలుగు వెలుగుల తెలుగే మనది
అన్ని భాషలకు వెలుగే మనది
మాతృ భాషలోనే మనము
మాటలాడుకుందాం.... మన 
తెలుగు భాషలోనే మనము
జవాబిచ్చుకుందాం  !! తెలుగే!!

తెలుగంటేనే ఎంతో ఇష్టం
తెలుగును మర్వకు ఓ నేస్తం 
తెలుగు భాషయే మనకు ప్రాణము
తీయని తెలుగు మన సొంతం 
చక్కని తెలుగు చదివేద్దాం 
ఎన్నో కవితలు రాసేద్దాం  !! తెలుగే!!

నాడు నేడు మహా కవులు
ఎందరో తెలుగుని కీర్తించారు 
కావ్యలెన్నో రాశారు 
తెనుగు తల్లీనే పొగిడారు!! తెలుగే!!

భాషా భక్తి ఉండాలి
మన మాతృ భాషనే వాడాలి
తెలుగు పద్యములు నేర్వాలి
చిన్న పిల్లలకు నేర్పించాలి !! తెలుగే!!

దేశ భాషలో తెలుగే లెస్సని
కీర్తించెను రాయలు ఆనాడే
అన్య భాషలు ఎన్ని ఉన్నా
మన మాతృ భాషనూ మరువద్దు!! తెలుగే!!

చక్కని తెలుగు చదివేద్దాం
ఎంతో చక్కగా రాసేద్దాం
తెలుగు భాష ఘన కీర్తిని
మనము లోకంలోన చాటేద్దాం!! తెలుగే!!
కామెంట్‌లు