ప్రాస పద గేయం;- -గద్వాల సోమన్న,9966414580
చల్లని గాలులు వీచెను
మల్లెలు కూడా పూచెను
ఎల్లలు లేని మోదమే
ఎల్లరి మదిలో వెలసెను

చుక్కలు నింగిని మెరిసెను
చక్కని సొగసులు రువ్వెను
లెక్కకు మించిన మోదమే
చక్కిలిగింతలు పెట్టెను

వెన్నెల జల్లులు కురిసెను
కన్నుల పండుగ చేసెను
వెన్న వన్నె రీతిలోన
మిన్నగా  మదిని దోచెను

నవ్వులు ముఖమున విరిసెను
దివ్వెల మాదిరి వెలిగెను
పువ్వు అందచందాలై
నవ్వే ఘనమని తెలిపెను


కామెంట్‌లు